EPF accounts in 2020 : ఉద్యోగులపై కోవిడ్ ప్రభావం ఎంత ఉందో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ తాజాగా విడుదల చేసిన డేటాలో కనిపిస్తుంది. రిటైర్మెంట్ బాడీ 2020 ఏప్రిల్ – డిసెంబర్ మధ్య 71 లక్షల ఖాతాలను మూసివేసినట్లు వెల్లడించింది.
గత ఏడాది ఏప్రిల్-డిసెంబరు మధ్య ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ 71 లక్షల 1,929 ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) ఖాతాల్ని మూసివేసినట్లు కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది.ఈ మేరకు కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ సోమవారం పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. 2019లో ఇదే సమయంలో 6,66,563 ఖాతాల్ని మూసివేసినట్లు వెల్లడించారు. ఉద్యోగ విరమణ, ఉద్యోగం కోల్పోవడం, వేరే ఉద్యోగానికి లేదా సంస్థకు మారడం వంటి పలు కారణాల వల్ల ఈపీఎఫ్ ఖాతాను మూసివేసినట్లు చెప్పారు.
ఇక, ఏప్రిల్-డిసెంబరు మధ్య పాక్షికంగా నగదు ఉపసంహరించుకున్న ఈపీఎఫ్ ఖాతాల సంఖ్య 2019లో 54,42,884 ఉండగా.. ఈసారి అది 1,27,72,120కి పెరిగినట్లు కేంద్రం తెలిపింది. ఇక ఉపసంహరించిన మొత్తం రూ. 55,125 కోట్ల నుంచి రూ.73,498కి పెరిగింది. ఇక కరోనా సంక్షోభంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికీ, అటువంటి వారికి కొత్తగా ఉపాధి కల్పించిన సంస్థల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ రోజ్‌గార్ యోజన (ఏబీఆర్‌వై) పథకాన్ని ఫిబ్రవరి 28 నాటికి 1.83 లక్షల సంస్థలు సద్వినియోగం చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తద్వారా 15.30 లక్షల మంది ఉద్యోగులు ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాల పరిధిలోకి వచ్చారని తెలిపింది. ఇక, గత నెలాఖరు నాటికి ఈ పథకం అమలు కోసం 186.34 కోట్లు విడుదల చేసినట్లు చెప్పింది.
మరోవైపు, ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లలో ఫిబ్రవరి 28 నాటికి రూ.27,532 కోట్లు ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు పెట్టినట్లు మరో సమాధానంలో గంగ్వార్ తెలిపారు. అలాగే లాక్‌డౌన్ సమయంలో 31,01,818 క్లెయింలను ఈపీఎఫ్‌ఓ సెటిల్ చేసినట్లు పేర్కొన్నారు.
చిన్న పొదుపు పథకాలు మరియు స్థిర డిపాజిట్లపై వడ్డీ రేటు తగ్గుతున్నప్పటికీ, ఈ నెల ప్రారంభంలో, 2020-21 సంవత్సరానికి EPFO వడ్డీ రేటును 8.5 శాతం వద్ద ఉంచింది. ప్రపంచంలో అత్యధిక పన్ను రహిత సావరిన్ రేట్లలో ఇపిఎఫ్ వడ్డీ రేటు ఒకటి. ఇది ఎఫ్వై 19 లో 8.65 శాతంగా ఉంది. ఇంతలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2019 జనవరి నుండి రెపో రేటును 2.5 శాతం తగ్గించి 4 శాతానికి తగ్గించింది.
ఇదిలావుంటే, ఈపిఎఫ్ పై అధిక వడ్డీ రేటు ఉద్యోగులను ఈపిఎఫ్ లో అధిక కార్పస్ పెట్టమని ప్రేరేపిస్తుంది. దీనివల్ల ప్రభుత్వం వడ్డీని చెల్లించడం కష్టమవుతుంది. ఈ విషయంలో, ప్రభుత్వం ఇప్పుడు ఈపీఎఫ్ వడ్డీ ఆదాయాన్ని పన్ను పరిధిలోకి తెచ్చింది. ఆర్థిక సంవత్సరం 2022 నుండి, మొత్తం ఉద్యోగి పీఎఫ్ సంవత్సరంలో రూ .2.5 లక్షలకు మించి ఉంటే, అదనపు మొత్తంలో సంపాదించిన వడ్డీ స్లాబ్ రేటు ప్రకారం పన్ను విధించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి… వినియోగదారులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్.. 120 రోజుల ముందుగానే పార్శిల్ బుక్ చేసుకునేందుకు వీలు..!