Cars Air Bags: చిన్న కార్లలో కూడా కనీసం 6 ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉండాలి: కేంద్ర మంత్రి కీలక ఆదేశాలు

|

Sep 22, 2021 | 6:21 PM

Cars Air Bags: ఈరోజుల్లో మధ్యతరగతి ప్రజలు సైతం కారును ఒక అవసరంగా భావిస్తున్నారు. అందుకే రోజురోజుకూ కార్ల సేల్స్ పెరుగుతున్నాయి. సామాన్యుడు..

Cars Air Bags: చిన్న కార్లలో కూడా కనీసం 6 ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉండాలి: కేంద్ర మంత్రి కీలక ఆదేశాలు
Cars Air Bags
Follow us on

Cars Air Bags: ఈరోజుల్లో మధ్యతరగతి ప్రజలు సైతం కారును ఒక అవసరంగా భావిస్తున్నారు. అందుకే రోజురోజుకూ కార్ల సేల్స్ పెరుగుతున్నాయి. సామాన్యుడు కూడా కారును కొనేందుకు ముందుకు వస్తున్నాడు. ఒకప్పుడు కారు అంటేనే కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపని వారు ప్రస్తుతం సులభంగా కొనేస్తున్నారు. కారు అంటే ఒక బైక్‌లా మారిపోయింది. కొత్త కారు కొనుగోలు చేయని వారు కూడా సెకండ్‌ హ్యాండ్‌లో కొనుగోలు చేస్తే ఎంజాయ్‌ చేస్తున్నారు. అలాగే కార్ల వల్ల ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. లగ్జరీ కార్లకు పెద్ద ప్రమాదం జరిగినా అందులో ఉండే ఎయిర్ బ్యాగ్స్‌తో ప్రాణాలను కొంతమేరకైనా కాపాడుకోవచ్చు. వాటిలో 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. కానీ చిన్న కార్లలో ఎయిర్ బ్యాగ్స్ ఉండవు. చిన్న కార్లను కేవలం పేదలు, మధ్య తరగతి ప్రజలు మాత్రమే కొంటారు కాబట్టి.. వాళ్ల ప్రాణాలు కూడా ముఖ్యమేనని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. చిన్న కార్లలోనూ కనీసం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండేలా కార్ల కంపెనీలు చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.

ఇటీవల ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా (PTI)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రికి ఎంట్రీ లెవల్ కార్లలో ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు ఉండవు అని ప్రశ్నించగా, మన దేశంలో రోడ్ల మీదికి వచ్చే ప్రతి కారులో కచ్చితంగా తగినన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉండాలని స్పష్టం చేశారు. పెద్దపెద్ద కార్లను, లగ్జరీ కార్లను కేవలం ధనవంతులు మాత్రమే కొనగలుగుతున్నారు. ఆ కార్లలో మాత్రమే ఆటోమొబైల్స్‌ కంపెనీలు ఎయిర్‌ బ్యాగ్స్‌ ఏర్పాటు చేస్తున్నాయి. మరి ఎంట్రీ లెవల్ కార్లలో ఎందుకు ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేయడం లేదు..? కార్లను తయారు చేసే ప్రతి కంపెనీ తప్పకుండా అన్ని మోడళ్ల వాహనాలలో ఎక్కువ ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాల ద్వారా సంభవించే మరణాల సంఖ్యను తగ్గేలా చర్యలు తీసుకోవాలి..అని నితిన్ గడ్కరీ అన్నారు.

మన దేశంలో పేదలు, మధ్య తరగతి ప్రజలే చిన్న కార్లను కొనుగోలు చేస్తారు. ఆ కార్లలో ఎయిర్ బ్యాగ్స్ లేకపోతే.. రోడ్డు ప్రమాదాల్లో వాళ్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే.. ఖచ్చితంగా అన్ని కార్లో ఆటోమొబైల్ కంపెనీలు.. కనీసం 6 ఎయిర్ బ్యాగ్స్‌ను ఏర్పాటు చేయాల్సిందే అని ఆయన తెలిపారు. ఈ విషయంపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఆటోమొబైల్ కంపెనీలకు పెద్ద సమస్యే

కాగా, కేంద్ర మంత్రి చెప్పినవి మంచి విషయాలే అయినా.. ప్రతి కారులో ఎయిర్ బ్యాగ్స్ అందించడం అనేది ఆటోమొబైల్ కంపెనీలకు పెద్ద సమస్యగా మారింది. మన దేశంలో ఇప్పటికే కార్ల మీద ఎక్కువ ట్యాక్స్ ఉంది. 28 శాతం వరకు జీఎస్టీని వసూలు చేస్తున్నారు. 22 శాతం వరకు సెస్, రోడ్ ట్యాక్స్ లాంటి వాటిని ఆటోమొబైల్ కంపెనీలే భరించాల్సి రావడంతో కార్ల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ధరలు అమాంతంగా పెంచేస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్ని వాహనాలలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ లాంటి ఫీచర్లను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ ఫీచర్లను కార్లలో ఏర్పాటు చేయాలంటే కార్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కార్ల తయారీ సంస్థలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.

Viral Video: 50 ఏళ్ల తర్వాత పేలిన అగ్ని పర్వతం.. ఇళ్లల్లోకి వచ్చిన లావా.. 100 ఇళ్లు ధ్వంసం

Train Ticket: రైలు టికెట్‌తో ఎన్నో ప్రయోజనాలు.. రూ.10 లక్షల వరకు బెనిఫిట్స్‌.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

43 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన షేర్లు.. ఇప్పుడు దాని విలువ రూ.1448 కోట్లు.. క్లెయిమ్‌ కోసం పోరాటం..!