ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు

| Edited By:

Jul 17, 2019 | 10:28 AM

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఉగ్రవాదులకు, ఆర్మీ జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బారాముల్లా జిల్లా సోపోరీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. అయితే తనిఖీలు చేస్తుండగా.. వీరిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. ఎదురుకాల్పులు చేపట్టారు. అయితే ఎంత మంది ఉగ్రవాదులు హతమయ్యారనేది ఇంకా తెలియరాలేదు. కాగా, మిగతా ఉగ్రవాదుల కోసం జల్లెడపడుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఇంటర్నెట్ సేవలు, మొబైల్ సేవలను నిలిపివేశారు. కాగా, అమర్ […]

ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు
Follow us on

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఉగ్రవాదులకు, ఆర్మీ జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బారాముల్లా జిల్లా సోపోరీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. అయితే తనిఖీలు చేస్తుండగా.. వీరిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. ఎదురుకాల్పులు చేపట్టారు. అయితే ఎంత మంది ఉగ్రవాదులు హతమయ్యారనేది ఇంకా తెలియరాలేదు. కాగా, మిగతా ఉగ్రవాదుల కోసం జల్లెడపడుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఇంటర్నెట్ సేవలు, మొబైల్ సేవలను నిలిపివేశారు. కాగా, అమర్ నాథ్ యాత్ర నేపథ్యంలో భద్రత కట్టుదిట్టంగా ఉన్నా.. ఉగ్రవాదులు దాడికి పాల్పడటం ఇది రెండో సారి.