బీహార్ బాటలో అస్సాం..వణికిస్తోన్న మెదడువాపు వ్యాధి

| Edited By: Srinu

Jul 01, 2019 | 7:47 PM

బీహార్ ను వణికించిన మెదడువాపు వ్యాధి ఇప్పుడు అస్సాంలో విజ్రుంభిస్తోంది. జపాన్ ఎన్సెఫలైటిస్ అనే ఈ మహమ్మారి వైరస్ కారణంగా ఇప్పటికే 11 మంది మ్రుతి చెందారు. దీంతో కేంద్రంలో కదలిక మొదలైంది. ఈ మేరకు అస్సాం రాష్ట్రంలోని పరిస్థితి సమీక్షించేందుకు ఓ కేంద్రబ్రుందాన్ని పంపించారు.  వైరస్ తీవ్రత గురించి అస్సాం ప్రభుత్వంతో కేంద్రం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని ఆయన తెలిపారు. జపనీస్ ఎన్సెఫలైటిస్ అని కూడా పిలిచే ఈ వ్యాధికి  వేగంగా వ్యాప్తి చెందే లక్షణం […]

బీహార్ బాటలో అస్సాం..వణికిస్తోన్న మెదడువాపు వ్యాధి
Follow us on

బీహార్ ను వణికించిన మెదడువాపు వ్యాధి ఇప్పుడు అస్సాంలో విజ్రుంభిస్తోంది. జపాన్ ఎన్సెఫలైటిస్ అనే ఈ మహమ్మారి వైరస్ కారణంగా ఇప్పటికే 11 మంది మ్రుతి చెందారు. దీంతో కేంద్రంలో కదలిక మొదలైంది. ఈ మేరకు అస్సాం రాష్ట్రంలోని పరిస్థితి సమీక్షించేందుకు ఓ కేంద్రబ్రుందాన్ని పంపించారు.  వైరస్ తీవ్రత గురించి అస్సాం ప్రభుత్వంతో కేంద్రం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని ఆయన తెలిపారు. జపనీస్ ఎన్సెఫలైటిస్ అని కూడా పిలిచే ఈ వ్యాధికి  వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంది. పక్షులు, జంతువులలో నిక్షిప్తమై ఉండే వ్యాధికారక వైరస్ దోమ ద్వారా మనిషికి సోకుతుంది.  మెదడులోకి ప్రవేశించి కణజాలంపై ప్రభావం చూపుతుంది. దీనినే మెదడువాపు వ్యాధి అని కూడా వ్యవహరిస్తారు. రెండు వారాల క్రితం బిహార్లో ఎన్సెఫలైటిస్ సోకడంతో 150 మందికి పైగా శిశుమరణాలు సంభవించాయి.