EMRS Recruitment 2023: బీఈడీ పాసైన వారికి అలర్ట్.. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో 4,062 ఉద్యోగాలు..

|

Jul 03, 2023 | 9:46 PM

భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ పాఠశాలల్లో (ఈఎంఆర్ఎస్‌).. 4,062 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది...

EMRS Recruitment 2023: బీఈడీ పాసైన వారికి అలర్ట్.. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో 4,062 ఉద్యోగాలు..
Eklavya Model Residential Schools
Follow us on

భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ పాఠశాలల్లో (ఈఎంఆర్ఎస్‌).. 4,062 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సోసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (ఎన్‌ఈఎస్‌టీఎస్‌) కింద ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ ఎగ్జామ్‌ (ఈఎస్‌ఎస్‌ఈ)-2023 ఆధారంగా ఈ నియామక ప్రక్రియ చేపడుతారు. మరాఠి, ఒడియా, తెలుగు, బెంగాలి, హిందీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, హిస్టరీ, జియోగ్రఫీ తదితర సబ్జెక్టుల్లో ఖాళీలున్నాయి. ప్రిన్సిపల్‌, పీజీటీ, అకౌంటెంట్‌, జేఎస్‌ఏ, ల్యాబ్‌ అటెండెంట్‌ పోస్టులు ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 31, 2023వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తుంది. ప్రిన్సినల్ పోస్టులకు రూ.2000, పీజీటీ పోస్టులకు రూ.1500, నాన్‌ టీచింగ్‌ పోస్టులకు రూ.1000ల చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పోస్టుల వారీగా ఖాళీలు..

  • ప్రిన్సిప‌ల్‌ పోస్టులు: 303
  • పోస్టు గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ) పోస్టులు: 2266
  • అకౌంటెంట్‌ పోస్టులు: 361
  • జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 759
  • ల్యాబ్‌ అటెండెంట్‌ పోస్టులు: 373

అర్హతలేవంటే..

  • ప్రిన్సిపల్‌ పోస్టులకు బీఈడీ, మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు కనీసం 12 ఏళ్ల పని అనుభవం ఉండాలి. వయసు 50 ఏళ్లకు మించకూడదు.
  • పీజీటీ పోస్టులకు బీఈడీతోపాటు పీజీ డిగ్రీ/ఎంఎస్సీ/ఎంఈ/ఎంటెక్‌/ఎంసీఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయసు 40 ఏళ్లకు మించకూడదు.
  • అకౌంటెంట్‌ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయసు 30 ఏళ్లు మించకూడదు.
  • జేఎస్‌ఏ పోస్టులకు సీనియర్‌ సెకండరీ ఉత్తీర్ణత ఉండాలి. వయసు 30 ఏళ్లు మించకూడదు.
  • ల్యాబ్‌ అటెండెంట్‌ పోస్టులకు పదో తరగతి/12వ తరగతిలో పాసై ఉండాలి. వయసు 30 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు ఇలా..

  • ప్రిన్సిపల్‌ పోస్టులకు నెలకు రూ.78,800 నుంచి రూ.2,09,200 చెల్లిస్తారు.
  • పీజీటీ పోస్టులకు నెలకు రూ.47,600 నుంచి రూ.1,51,100 చెల్లిస్తారు.
  • అకౌంటెంట్‌ పోస్టులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.
  • జేఎస్‌ఏ పోస్టులకు నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 చెల్లిస్తారు.
  • ల్యాబ్‌ అటెండెంట్ పోస్టులకు నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 చెల్లిస్తారు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.