కాంట్రాక్టర్లతో పనులు చేయించుకోవడం ప్రస్తుత కాలంలో సాధారణ విషయమే. కాస్ట్, ప్లాన్ చెప్పేస్తే వాళ్లే మనకు కావాల్సినట్టుగా పని చేసేస్తారు. అయితే ఈ విధానంలోనూ కొందరికి ఇబ్బందులు తప్పడం లేదు. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో ఓ వ్యక్తి తనకు కూలీ డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో యజమానిపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్పుర్ప్రాంతానికి చెందిన రణ్వీర్నోయిడాలోని సదర్పుర్కాలనీకి చెందిన ఆయుష్ చౌహాన్ ఇంట్లో వర్క్ చేశాడు. ఈ పనులకు సంబంధించి రణ్వీర్కు ఆయుష్ రూ.2లక్షలు ఇవ్వాల్సి ఉంది. తనకు డబ్బులు కావాలని ఎన్ని సార్లు అడిగినా ఆయుష్ లో మార్పు రాలేదు. రేపు మాపు అంటూ కాలయాపన చేశాడు. యజనాని తీరుతో విసిగిపోయిన రణ్ వీర్ అతనిపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. మంగళవారం బైక్పై సదర్పుర్ కాలనీకి రణ్ వీర్ వచ్చాడు. ఆయుష్ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న మెర్సిడైజ్ బెంజ్ కారుపై పెట్రోల్ పోసి, నిప్పంటించాడు. అనంతరం ఏమీ ఎరగనట్లు వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
Man sets #MercedesBenz on fire in #Noida because the car owner did not pay him money due for tiles installation. #UttarPradesh #ViralVideo pic.twitter.com/4OriOvp1M4
ఇవి కూడా చదవండి— The Viral Finder (@TheViralFinder) September 14, 2022
సీసీటీవీ ఫుటేజ్ లో ఓ వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని బైక్ పై వచ్చాడు. ఎవరూ లేని సమయంలో కారుపై పెట్రోల్ పోసి కారును తగులబెట్టాడు. అందులో స్పష్టంగా కన్పించింది. ఈ దృశ్యాలు ఇంటి సమీపంలోని సీసీ టీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రణ్ వీర్ ను అరెస్ట్ చేశారు. 2020లో ఇంట్లో టైల్స్ వేసిన పనికి సంబంధించి రూ.2 లక్షల కూలీ ఇవ్వకుండా సతాయిస్తున్నాడని అతను పోలీసులకు చెప్పాడు. పని చేయించుకుని డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు వెల్లడించాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..