Elephant attack : జనావాసంలోకి గజరాజులు.. ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.. భయం గుపిట్లో ప్రజలు

|

Jan 11, 2021 | 10:09 PM

గత కొద్దికాలంగా వన్యప్రాణులు జనావాసంలోకి వస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పులులు, చిరుతలు జనావాసంలోకి వచ్చి దాడులు చేస్తున్నాయి.

Elephant attack : జనావాసంలోకి గజరాజులు.. ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.. భయం గుపిట్లో ప్రజలు
Follow us on

Elephant attack : గత కొద్దికాలంగా వన్యప్రాణులు జనావాసంలోకి వస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పులులు, చిరుతలు జనావాసంలోకి వచ్చి దాడులు చేస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఏనుగులు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. తాజాగా ఏనుగుల దాడిలో ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పూర్‌ ప్రాంతంలో గత కొద్దిరోజులుగా ఏనుగుల గుంపు తిరుగుతుందని ఆ ప్రాంత అటవీశాఖ అధికారి తెలిపారు. వేరు వేరు ప్రాతాల్లో ఏనుగులు చేసిన దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఏనుగుల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఏనుగుల దాడుల నుంచి ప్రజలను కాపాడేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ అధికారి వివరించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

jammu kashmir earthquake : జమ్ముకశ్మీర్‌లో కంపించిన భూమి.. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.1గా నమోదు..

కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ కారుకు ప్రమాదం.. భార్య మృతి.. ఇప్పటివరకు అందిన వివరాలు ఇవి