Today Fuel Price: స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజీల్‌ ధరలు… తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరల వివరాలు..

Today Petrol, Diesel Price: సోమవారంతో పోలిస్తే మంగళవారం దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డిజీల్‌ ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. రోజువారి ఇంధన ధరలను సవరిస్తోన్న నేపథ్యంలో...

Today Fuel Price: స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజీల్‌ ధరలు... తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరల వివరాలు..
Follow us

|

Updated on: Jan 12, 2021 | 5:48 AM

Today Petrol, Diesel Price: సోమవారంతో పోలిస్తే మంగళవారం దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డిజీల్‌ ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. రోజువారి ఇంధన ధరలను సవరిస్తోన్న నేపథ్యంలో మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో చాలా స్వల్ప వ్యవధిలో ధరల్లో మార్పులు కనిపించాయి. దేశ రాజధాని నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల వరకు ఈరోజు (మంగళవారం) పెట్రోల్‌, డీజీల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 87.59గా ఉండగా.. డీజీల్‌ ధర 81.17గా నమోదైంది. ఇక కరీంనగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.87.99 కాగా డీజీల్‌ 81.54గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 90.33 ఉండగా డీజీల్‌ రూ. 83.44గా నమోదైంది. గుంటూరులో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ. 90.33 కాగా.. డీజీల్‌ ధర రూ. 83.44గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికొస్తే లీటర్‌ పెట్రోల్‌ రూ. 84.20గా ఉండగా.. డీజీల్‌ విషయానికొస్తే.. లీటర్‌ ధర రూ. 74.38గా ఉంది. (సోమ, మంగళ వారాల్లో ఎలాంటి మార్పు లేదు). దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రల్‌ ధర రూ. 90.83 ఉండగా డీజీల్‌ రూ. 81.07గా ఉంది. చెన్నైలో మంగళవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 86.96 ఉండగా డీజీల్‌ ధర రూ. 79.72గా ఉంది.

Also Read:  Daily essentials: సామాన్యులకు మరో షాక్.. పెరగనున్న వంట నూనె , సబ్బులు, బిస్కెట్ల ధరలు