సునీల్ కానుగోలు.. కర్నాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్కికల సమయంలో ప్రముఖంగా వినిపించిన పేరు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ కనుగోలు పేరు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు రాష్ట్రాలలో మార్మోగింది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు అనుసరించిన వ్యూహాలనే సునీల్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమలు చేశారు. ప్రతి సామాన్యుడికీ కాంగ్రెస్ గ్యారంటీలు అర్థమయ్యేలా వివరించడంలో సునీల్ టీమ్ సక్సెసయింది.
2024 లోక్‌సభ ఎన్నికల కాంగ్రెస్ ప్రచారంలో భాగం కావడం లేదు. గతంలో కాంగ్రెస్ ‘టాస్క్ ఫోర్స్ 2024’లో భాగంగా ఉంటారని పార్టీ ప్రకటించింది. అయితే తాజాగా ఆయన హర్యానా, మహారాష్ట్ర ప్రచారాలపై దృష్టి సారిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు సంవత్సరాల క్రితం ప్రశాంత్ కిషోర్ టీమ్ నుంచి వైదొలిగిన తర్వాత, పార్టీ సార్వత్రిక ఎన్నికల ప్రిపరేషన్‌తో సంబంధం లేని రెండవ హై-ప్రొఫైల్ పోల్ మాస్టర్‌మైండ్‌గా అవతరలించారు సునీల్ కానుగోలు. ఈ నేపథ్యంలోనే రీడెప్లాయ్‌మెంట్‌కు ఆ రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే టీమ్‌లు ఉన్నాయి. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదే నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది.
ఏప్రిల్, మే నెలలో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మార్గనిర్దేశం చేసేందుకు పోల్ వ్యూహకర్త సునీల్ కనుగోలు అందుబాటులో ఉండకపోవచ్చన వార్త పార్టీలో కొంత కలవరపాటుకు గురిచేసింది. ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఒక సీనియర్ నాయకుడు, లోక్‌సభ ప్రచారానికి ఆయన గైర్హాజరు కానున్నట్లు తెలిపారు. ఇది పార్టీకి కొద్దిగా ఎదురుదెబ్బ లాంటిదే అని అంగీకరించారు. అయితే అతను తన మేథ సంపత్తును కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించగలిగితే ఎక్కువ దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ నమ్ముతుందని చెప్పారు. బీజేపీ నుంచి కీలక రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
సునీల్ కనుగోలు ప్రస్తుతుం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సలహాదారుగా కొనసాగుతున్నారు. కర్ణాటక, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాలతో, కేబినెట్ హోదాతో పని చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….