Viral News: ప్రభుత్వాసుపత్రిలో ఐవీ ఫ్లూయిడ్ స్టాండ్‌ల ప్లేస్‌లో ‘మాప్ స్టిక్స్’.. ఫొటో వైరల్!
ప్రభుత్వాసుపత్రిలో ఐవీ ఫ్లూయిడ్ స్టాండ్స్‌కి బదులుగా 'మాప్ స్టిక్' వాడటం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి జోరుగా వైరల్ అవుతుంది. ఈ సంఘటన తమిళనాడు కాంచీపురం జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ఫీవర్ వార్డులో చోటు చేసుకుంది. ఈ ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఫొటోలో మాప్ స్టిక్‌కు గ్లూకోజ్ బాటిల్స్ తగిలించి ఉంచారు. ఒక రోగి బెడ్‌పై చికిత్స తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు..
ప్రభుత్వాసుపత్రిలో ఐవీ ఫ్లూయిడ్ స్టాండ్స్‌కి బదులుగా ‘మాప్ స్టిక్’ వాడటం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి జోరుగా వైరల్ అవుతుంది. ఈ సంఘటన తమిళనాడు కాంచీపురం జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ఫీవర్ వార్డులో చోటు చేసుకుంది. ఈ ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఫొటోలో మాప్ స్టిక్‌కు గ్లూకోజ్ బాటిల్స్ తగిలించి ఉంచారు. ఒక రోగి బెడ్‌పై చికిత్స తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అధికారుల దృష్టికి చేరింది. దీంతో ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు విచారణకు ఆదేశించారు.
వైద్యుల కొరత భర్తీ చేయాలి..
ఈ ఘటనపై ఏఎంఎంకే టీటీవీ దినకరణ్ స్పందిస్తూ.. కాంచీ పురం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రోజుకు వెయ్యి మందికి పైగా రోగులు వైద్యం కోసం వస్తున్నారని.. అయితే వారికి ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు కూడా లేవని ఆరోపించారు. వైద్యులు, నర్సుల కొరత, వైద్య పరికరాల కొరతపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడమే రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వరుస వైద్యుల నిర్లక్ష్యానికి కారణమన్నారు.
డీఎంకే హయాంలో ఆరోగ్య శాఖనే.. ఐసీయూలో ఉంది..
తమిళనాడు ప్రభుత్వం ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించి, అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు చికిత్స చేయడానికి ప్రాథమిక పరికరాలు ఉండేలా చూడాలని దినకరన్ అన్నారు. అదే విధంగా చెన్నైలోని రాయ పేట ప్రభుత్వ ఆస్పత్రిలో హాజరైన రోగులు గ్లూకోజ్ బాటిళ్లు పట్టుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత రోజే.. ఈ న్యూస్ రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై మాజీ ఆరోగ్య మంత్రి సీ విజయ భాస్కర్ స్పందిస్తూ.. డీఎంకే హయాంలో ఆరోగ్య శాఖనే.. ఐసీయూలో ఉందని ఎద్దేవా చేశారు.
తమిళనాడులో వరుస పెట్టి ప్రభుత్వ ఆస్సత్రుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రుల్లో తమను ఎవరూ సరిగ్గా పట్టించుకోవడం లేదని మొర పెట్టుకుంటున్నారు. మరి ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.