కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. బెంగాల్ తప్ప 6 రాష్ట్రాలకు అవకాశం..!

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) గడువును పొడిగించింది. అయితే, ఈ రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్ లేకపోవడం విశేషం. ఇక్కడ ప్రతిపక్షాలు SIR విషయంలో గగ్గోలు పెడుతున్నాయి తమిళనాడు, గుజరాత్‌లలో, డిసెంబర్ 14 నాటికి ఫారమ్‌లు నింపాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. బెంగాల్ తప్ప 6 రాష్ట్రాలకు అవకాశం..!
Special Intensive Revision Of Voter List

Updated on: Dec 11, 2025 | 5:07 PM

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) గడువును పొడిగించింది. అయితే, ఈ రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్ లేకపోవడం విశేషం. ఇక్కడ ప్రతిపక్షాలు SIR విషయంలో గగ్గోలు పెడుతున్నాయి తమిళనాడు, గుజరాత్‌లలో, డిసెంబర్ 14 నాటికి ఫారమ్‌లు నింపాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. డిసెంబర్ 19న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయడం జరుగుతుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో, డిసెంబర్ 18 నాటికి SIR ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 23న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. ఉత్తరప్రదేశ్‌లో, డిసెంబర్ 26 నాటికి ఫారమ్‌లు నింపాల్సి ఉంటుంది. డిసెంబర్ 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

గోవా, గుజరాత్, లక్షద్వీప్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లకు ఫారమ్‌లను దాఖలు చేయడానికి గడువు నేటితో, డిసెంబర్ 11, 2025తో ముగుస్తుంది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా డిసెంబర్ 16, 2025న ప్రచురించడం జరుగుతుంది. కేరళలో SIR షెడ్యూల్ గతంలో మార్చారు. SIR ప్రక్రియ డిసెంబర్ 18, 2025 నాటికి పూర్తి కావాల్సి ఉంది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా డిసెంబర్ 23న ప్రచురిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కొనసాగుతున్న SIR ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం బుధవారం (డిసెంబర్ 10, 2025) ఒక కీలక ఆదేశాన్ని జారీ చేసింది. బూత్ స్థాయిలో తయారు చేసిన గైర్హాజరు, బదిలీ చేసిన, చనిపోయిన లేదా నకిలీ ఓటర్ల (ASD) జాబితాలను రాజకీయ పార్టీల బూత్-స్థాయి ఏజెంట్లతో పంచుకోవాలని కోరింది. ఇందుకోసం సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..