“గావురాల కొడుకా రా…రా..” కన్నీళ్లు తెప్పిస్తున్న నాగలక్ష్మిపాట

|

Jun 17, 2020 | 6:12 PM

సూర్యాపేట కన్నీటిసంద్రంగా మారింది. తమ ప్రాంతానికి చెందిన వీరుడి మరణాన్ని స్థానికులు తట్టుకోలేకపోతున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతోషబాబు కన్నవారిని ఓదార్చుతున్నారు. ఒక్కగానొక్క కొడుకు చైనా దురాగతానికి బలికావడంతో వారి రోదన వర్ణనాతీతంగా మారింది. దేశసేవలో తమ బిడ్డ ప్రాణాలు వదలడం సంతోషంగా ఉందని చెబుతున్నా.. కడుపుకోతను ఎవరూ కాదనలేరు. లోలోపలి నుంచి వచ్చే దుఃఖం ప్రతీ ఒక్కరినీ కలిచివేస్తోంది. ఓ మహిళ అయితే ఏకంగా సంతోష్‌బాబును తలచుకుంటూ.. దేశభక్తి నిండిన పాటతో ప్రతీ ఒక్కరి గుండెల్ని […]

గావురాల కొడుకా రా...రా.. కన్నీళ్లు తెప్పిస్తున్న నాగలక్ష్మిపాట
Follow us on

సూర్యాపేట కన్నీటిసంద్రంగా మారింది. తమ ప్రాంతానికి చెందిన వీరుడి మరణాన్ని స్థానికులు తట్టుకోలేకపోతున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతోషబాబు కన్నవారిని ఓదార్చుతున్నారు. ఒక్కగానొక్క కొడుకు చైనా దురాగతానికి బలికావడంతో వారి రోదన వర్ణనాతీతంగా మారింది.

దేశసేవలో తమ బిడ్డ ప్రాణాలు వదలడం సంతోషంగా ఉందని చెబుతున్నా.. కడుపుకోతను ఎవరూ కాదనలేరు. లోలోపలి నుంచి వచ్చే దుఃఖం ప్రతీ ఒక్కరినీ కలిచివేస్తోంది. ఓ మహిళ అయితే ఏకంగా సంతోష్‌బాబును తలచుకుంటూ.. దేశభక్తి నిండిన పాటతో ప్రతీ ఒక్కరి గుండెల్ని కదిలించింది.  “ఎక్కడున్నావురా కొడుకా… నా గావురాల కొడుకా రా…రా..” అంటూ సూర్యాపేట జిల్లా ఇమామ్‌పేటకు చెందిన నాగలక్ష్మి పాడిన పాట అందరిని కన్నీళ్లు తెప్పిస్తోంది.

ఆర్మీలో పనిచేసి అసువులు బాసిన వీరుల కుటుంబాలకు చెందిన వాళ్లు కూడా సంతోష్‌బాబు తల్లిదండ్రులను ఓదార్చేందుకు ముందుకు వస్తున్నారు. 1999లో సూర్యాపేటకు చెందిన గోపిచారి అనే ఆర్మీ అధికారి చనిపోయారు. అతని భార్య శారద.. సంతోష్‌బాబు ఇంటికి వచ్చి వారిని ఓదార్చడమే కాదు.. ప్రభుత్వం, ఈ సమాజం తోడుగా ఉంటుందంటూ ధైర్యం నింపారు.