ED Officers: బ్యాంకులకు రుణం ఎగ్గొట్టి విదేశాలకు పరారైన గీతాంజలి గ్రూప్ ప్రమోటర్ మెహుల్ చోక్సీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. మెహుల్ చోక్సీకి సంబంధించిన మరో రూ. 14 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.13 వేల కోట్లు రుణం తీసుకున్న మెహుల్ చోక్సీ.. ఆ రుణాన్ని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు చోక్సీపై అనేక కేసులు పెట్టారు. ఇప్పటికే అనేక ఆస్తులను జప్తు చేసుకున్న అధికారులు.. తాజాగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ముంబైలోని గోరేగాన్ వద్ద ఉన్న 1,460 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్‌తోపాటు ప్లాటినం ఆభరణాలు, డైమండ్లు, నెక్లెస్, ఆభరణాలు, గడియారాలు, మెర్సిడెజ్ బెంజ్ కార్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఈడీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. తాజా స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ. 14.45 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
Also read:
India Vs England 2021-22: తండ్రి అవ్వడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ..
Overseas tour: ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఝలక్ ఇచ్చిన సర్కార్.. ఇక నుంచి ఆ విషయాలు చెప్పాల్సిందే..