Election Commission: తనిఖీల్లో ఇప్పటివరకు ఎంత నగదు పట్టుబడిందో తెలిస్తే బిత్తరపోతారు

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో నగదు, మద్యం ఏరులై పారుతుంది. 75 ఏళ్ల సార్వత్రిక ఎన్నికల చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ప్రతిరోజు 100 కోట్ల విలువైన నగదు, మద్యంతో పాటు ఇతర వస్తువులు జప్తు చేయడం జరిగిందని ఈసీ పేర్కొంది. రికార్డు స్థాయిలో ఇప్పటివరకు 4650 కోట్ల విలువైన నగదు, నగలు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

Election Commission: తనిఖీల్లో ఇప్పటివరకు ఎంత నగదు పట్టుబడిందో తెలిస్తే బిత్తరపోతారు
Election Commission seizures (Representative image)

Updated on: Apr 15, 2024 | 6:02 PM

ఎన్నికల జాతరలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు.. నోట్ల మంత్రాన్ని ప్రయోగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఎప్పటి నుంచో దాచి పెట్టిన నోట్ల కట్టలను.. ఇప్పుడు బయటకు తీసి సైలెంట్‌గా ఓటర్లకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో భారీగా నిర్వహిస్తున్న తనిఖీల్లో పట్టుబడుతున్న నగదును చూసి అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా మే 1 నుంచి ఇవాళ్టి దాకా.. అంటే 45 రోజుల్లో పట్టుబడింది ఎంతో తెలుసా.. 4వేల 650 కోట్లు. అంటే రోజుకు 100 కోట్లకు పైనే నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 4వేల 650 కోట్లలో 396 కోట్లు నగదు కాగా.. 562 కోట్ల విలువ చేసే బంగారం ఇతర విలువైన వస్తువులు సీజ్ చేశారు. ఇక 490కోట్ల విలువ చేసే మద్యాన్ని సీజ్ చేశారు ఎన్నికల అధికారులు. ఇక 2వేల 69 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక పట్టుబడిన టీవీలు, ప్రిడ్జ్‌లు లాంటి వస్తువులు 11 వందల 42 కోట్లు విలువ చేస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో 3వేల 475 కోట్లు స్వాధీనం చేసుకోగా.. ఈసారి ఇప్పటికే 4వేల 650 కోట్లు దొరికాయి. ఇక పూర్తిగా ఎన్నికలయ్యేలోపు ఈ లెక్క వెయ్యి కోట్లు దాటినా ఆశ్చర్యపోవక్కర్లేదు.  ఓటర్స్ ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఈసీ తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..