Remote Voting: మరో విప్లవాత్మక నిర్ణయం దిశగా సీఈసీ.. దేశంలో ఎక్కడి నుంచైనా ఓటు వేసేలా..

|

Jan 26, 2021 | 10:23 PM

Remote Voting: కేంద్ర ఎన్నికల మరో విప్లవాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. కేటాయించిన పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేసే విధానానికి..

Remote Voting: మరో విప్లవాత్మక నిర్ణయం దిశగా సీఈసీ.. దేశంలో ఎక్కడి నుంచైనా ఓటు వేసేలా..
Follow us on

Remote Voting: కేంద్ర ఎన్నికల మరో విప్లవాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. కేటాయించిన పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేసే విధానానికి స్వస్తి పలికేలా.. దేశంలో ఎక్కడి నుంచైనా ఓటు వేసే కొత్త విధానాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి సునీల్ అరోరా.. కీలక విషయాలు తెలిపారు. దేశంలో ఏ పోలింగ్ కేంద్రం నుంచైనా ఓటు వేసేందుకు వీలుగా రిమోట్ ఓటింగ్ విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నామని చెప్పారు.

రిమోట్ ఓటింగ్ విధానాన్ని త్వరలోనే ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామని ఆయన ప్రకటించారు. మద్రాస్ ఐఐటీతో సహకారంతో ఈ విధానాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే, ఈ విధానంలో పోలింగ్ కేంద్రాల్లోనే ఓటు వేయాల్సి ఉంటుందని సునీల్ అరోరా స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వేరే ప్రాంతంలోని పోలింగ్ కేంద్రం నుంచి వినియోగించుకునే అవకాశం లభిస్తుందన్నారు.

Also read:

Air pollution: వాయు కాలుష్యం కారణంగా అబార్షన్లు.. శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైన సంచలన విషయాలు

కరోనా ఎఫెక్ట్ : ఇటలీలో రాజకీయ గందరగోళం.. రాజీనామా చేయనున్న ప్రధాని గిసెప్పే కాంటే