బెంగాల్ లో రోడ్ షోలు, బైక్ ర్యాలీల నిషేధం, ఎన్నికల కమిషన్ ఆదేశం, తక్షణమే అమలు

| Edited By: Phani CH

Apr 22, 2021 | 9:31 PM

పశ్చిమ బెంగాల్ లో రోడ్ షోలను, బైక్ ర్యాలీలను నిషేధిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దేశంలో సెకండ్ కోవిడ్ ప్రబలంగా ఉన్న దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది.

బెంగాల్ లో రోడ్ షోలు, బైక్ ర్యాలీల నిషేధం, ఎన్నికల కమిషన్ ఆదేశం, తక్షణమే అమలు
Roadshows Held By Bengal
Follow us on

పశ్చిమ బెంగాల్ లో రోడ్ షోలను, బైక్ ర్యాలీలను నిషేధిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దేశంలో సెకండ్ కోవిడ్ ప్రబలంగా ఉన్న దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. ఈ రాష్ట్రంలో మిగతా రెండు దశల ఎన్నికలు ఈ నెల 26 , 29 తేదీల్లో జరగాల్సి ఉన్నాయి. అయితే పాదయాత్రలు, రోడ్ షో లు, సైకిల్, బైక్ ర్యాలీలను తక్షణమే బ్యాన్ చేస్తున్నామని వెల్లడించింది. రాజ్యాంగంలోని 324 అధికరణం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అలాగే ఏ ప్రచార సభకైనా 500 మందికి మించి అనుమతించేది లేదని కూడా స్పష్టం చేసింది. ర్యాలీల వంటివాటికీ  ఇదివరకే అనుమతి ఉన్నా ఆ అనుమతి రద్దయినట్టే భావించాలని ఈసీ సూచించింది.  జనం పరిమిత సంఖ్యలో ఉండేలా చూడాలి.. పలురాజకీయ పార్టీలు, అభ్యర్థులు కోవిడ్ రూల్స్ ని అతిక్రమిస్తున్నారు అని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. .

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఆక్సిజన్ అయిపోవడానికి 3 గంటలే ఉంది, ఢిల్లీ ఆకుపత్రి బెడ్ పై నుంచి ఆప్ నేత వీడియో

Tollywood : టాలీవుడ్‌ను కాటేస్తున్న కరోనా మహమ్మారి… కోవిడ్‌తో తెలుగు ఇండస్ట్రీ ఎన్ని కోట్లు నష్టపోయిందంటే..!