ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 5.4గా నమోదు..

|

Nov 12, 2022 | 8:56 PM

ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5.4గా నమోదైంది. 4 రోజుల వ్యవధిలో మరోసారి భూమి కంపించడంతో ఢిల్లీవాసులు భయందోళనలకు గురవుతున్నారు.

ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 5.4గా నమోదు..
Earthquake
Follow us on

దేశ రాజధాని ఢిల్లీని మరోసారి భూకంపం వణికించింది. భూకంప తీవ్రత 5.4గా నమోదయ్యిందని అధికారులు గుర్తించారు. నాలుగు రోజుల్లో రెండోసారి భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి పరగులు పెట్టారు. ఉత్తరాఖండ్‌, ఢిల్లీ ఎన్సీఆర్‌ పరిధిలో చాలా చోట్ల భూప్రకంపనలు వచ్చాయి. ఘజియాబాద్‌, నోయిడాలో జనం ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. మరోవైపు ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఢిల్లీలో భూమి కంపించిన విషయం విదితమే. అప్పుడు రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రతగా నమోదైంది.