Assam Earthquake: ఉత్తర భారతదేశంలో తరచూ సంభవిస్తున్న భూకంపాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవలనే అస్సాం, బెంగాల్, తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా అసోంలో మరోమారు భూకంపం సంభవించింది. అస్సాం రాజధాని గువాహటి సమీపంలోని సోనిత్‌పూర్‌లో ఆదివారం మధ్యాహ్నం 2.23 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.
కాగా.. భూకంప కేంద్రం సోనిత్‌పూర్ జిల్లాలో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 16 కి.మీ. లోతులో భూమి కంపించిందని తెలిపింది. గత నెలలో కూడా సోనిత్‌పూర్‌లో తీవ్ర భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా తేజ్‌పూర్, బ్రహ్మపుత్ర నది పరిసరాల్లో మొత్తం 25 సార్లు భూమి కంపించింది. భారీగా భూమి కంపించడంతో పలు పలు ప్రాంతాల్లోని ఇళ్లకు బీటలు వారాయి. అదేవిధంగా కొంతమేర నష్టం వాటిల్లింది. కాగా మరోసారి అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలంతా ఇళ్ళల్లోనుంచి పరుగులు తీశారు.
Also Read: