Dubai Expo 2020: ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, రణవీర్ సింగ్

|

Mar 28, 2022 | 10:20 PM

Dubai Expo 2020: దుబాయ్ ఎక్స్‌పో 2020లో భాగంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, నటుడు రణ్‌వీర్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దుబాయ్ పర్యటనలో భాగంగా

Dubai Expo 2020: ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, రణవీర్ సింగ్
Anurag Thakur, Ranveer Sing
Follow us on

Dubai Expo 2020: దుబాయ్ ఎక్స్‌పో 2020లో భాగంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, నటుడు రణ్‌వీర్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దుబాయ్ పర్యటనలో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) సోమవారం దుబాయ్ ఎక్స్‌పో 2020లో పాల్గొన్నారు. ఇండియా పెవిలియన్‌లోని ‘ది గ్లోబల్ రీచ్ ఆఫ్ ఇండియన్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ’ గురించి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. రణ్‌వీర్ సింగ్‌ (Ranveer Singh) తో ప్రత్యేకంగా సంభాషించారు. ఈ సందర్భంగా మంత్రి అనురాగ్ భారతీయ సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందిన విధానంపై మాట్లాడారు. భారత్ సినిమా ఇండస్ట్రీకి పెట్టింది పేరని.. విదేశాల్లోనూ భారతీయ సినిమా సత్త చాటుతోందని పేర్కొన్నారు. సినిమా పరిశ్రమ ద్వారా ఎంతో మందికి ఉపాధి లభించిందని మంత్రి పేర్కొన్నారు.

విదేశాలల్లో ఉన్న భారతీయులు దేశ ఖ్యాతిని నలుదిక్కులా చాటి చెబుతున్నారని తెలిపారు. ఇండియా పెవిలియన్ 1.7 మిలియన్ల సందర్శకులతో భారీగా కిక్కిరిసిపోయిందని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వేడుకలు జరుగుతున్నాయని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. చిత్ర పరిశ్రమ విదేశీయులపై మంచి ప్రభావాన్ని చూపిందన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో అత్యున్నత స్థానానికి చేర్చడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా రణ్‌వీర్ సింగ్ నటనా ప్రతిభను మంత్రి కొనియాడారు.

ఈ విషయమై రణవీర్ సింగ్ మాట్లాడుతూ.. భారతీయ సినిమా సరిహద్దులను చెరిపేస్తున్నాయని ఇతర దేశాల ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. దేశ విదేశాల్లో భారత సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కాగా.. ఈ భేటీకి ముందు మంత్రి అనురాగ్ ఠాకూర్, రణ్‌వీర్ సింగ్‌తో కలిసి దుబాయ్ ఎక్స్‌పో 2020లో ఇండియా పెవిలియన్‌ను సందర్శించారు.

అంతకుముందు రోజు మంత్రి అనురాగ్.. దుబాయ్ కార్పొరేషన్ ఫర్ టూరిజం అండ్ కామర్స్ మార్కెటింగ్ సిఇఒ ఇస్సామ్ కాజిమ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పర్యాటక రంగానికి సంబంధించి దుబాయ్ అనుసరించిన వివిధ వ్యూహాలపై చర్చలు జరిపారు. దీంతోపాటు పర్యాటకం, మీడియా, వినోద రంగాల్లో పరస్పర సహకారంపై చర్చల కోసం అనురాగ్ ఠాకూర్ కాజిమ్‌ను భారతదేశానికి ఆహ్వానించారు.

Also Read:

Harish Shankar: హరీష్ శంకర్ అయితేనే బెటర్ అంటున్న మెగాస్టార్.. ఈమూవీ కోసం అంటే

RRR Movie : జక్కన్న సినిమాకు తప్పని పైరసీ బెడద.. గుర్రుగా ఉన్న ఫ్యాన్స్