Chennai: చెన్నైలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్‌.. కుటుంబానికి తెలుస్తుందని ఆత్మహత్య చేసుకున్న నిందితుడు..

చెన్నైలో డ్రగ్స్‌ డీలర్‌ ఆత్మహత్య కలకలం రేపుతోంది. విచారణ సమయంలో నిందితుడు సూసైడ్‌ చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై విచారణకు..

Chennai: చెన్నైలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్‌.. కుటుంబానికి తెలుస్తుందని ఆత్మహత్య చేసుకున్న నిందితుడు..
Drug Offender Death

Updated on: Oct 22, 2022 | 9:09 PM

చెన్నైలో డ్రగ్స్‌ డీలర్‌ ఆత్మహత్య కలకలం రేపుతోంది. విచారణ సమయంలో నిందితుడు సూసైడ్‌ చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించడంతో.. డ్రగ్స్‌ డీలర్‌ సూసైడ్‌ చేసుకోవడానికి కారణమేంటన్నదానిపై ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నారు పోలీసులు. చెన్నైలో పలుమార్లు భారీగా మత్తు పదార్ధాలు పట్టుబడటంతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా చెన్నైలో సోదాలు నిర్వహించిన పోలీసులు.. డ్రగ్స్‌ విక్రయిస్తున్న రాయప్పరాజు ఆంటోనీని అరెస్ట్‌ చేశారు. అతని నుంచి సుమారు 50 కేజీల యాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిని పాత నేరస్తుడిగా గుర్తించిన పోలీసులు.. ఆయపాక్కంలోని సెంట్రల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యారో యూనిట్ ఆఫీస్‌లో విచారించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొస్తుండగా.. బిల్డింగ్‌ థర్డ్‌ ఫ్లోర్‌ నుంచి కిందికి దూకేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు ప్రకటించారు వైద్యులు. రాయప్పరాజు ఆంటోనీ హైదరాబాద్‌కు చెందిన వాడిగా గుర్తించారు పోలీసులు.

అయితే విచారణ సమయంలో నిందితుడు బిల్డింగ్‌పై నుంచి దూకి సూసైడ్‌ చేసుకోవడం దుమారం రేపుతోంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు మెజిస్ట్రేట్‌. ప్రస్తుతం కీల్‌పాకం ప్రభుత్వాస్పత్రిలో ఉన్న అతని డెడ్‌బాడీ పోస్ట్‌మార్టం ప్రక్రియను వీడియో తీయాలని ఆదేశించారు. కాగా, నిందితుడు సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నడుపుతూనే డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేసి విక్రయించేవాడని తేలింది. ఈ క్రమంలోనే అసలు విషయం తన కుటుంబ సభ్యులకు తెలుస్తుందనే భయంతోనే బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే, అసలేం జరిగిందన్నది తేలాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..