24 గంటల్లో ముంబైలో ప్రత్యేక డ్రైవ్-ఇన్ వ్యాక్సినేషన్ సెంటర్లు, ప్రతి జోన్ లోనూ సిద్ధం

మహారాష్ట్రలో పెరిగిపోతున్న కోవిద్ కేసులను అదుపు చేసేందుకు ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ముంబైలో 24 గంటల్లో డ్రైవ్-ఇన్-వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.

  • Publish Date - 10:22 pm, Thu, 6 May 21 Edited By: Phani CH
24  గంటల్లో ముంబైలో ప్రత్యేక డ్రైవ్-ఇన్ వ్యాక్సినేషన్ సెంటర్లు, ప్రతి జోన్ లోనూ సిద్ధం
Drive In Vaccinations Centres In Mumbai

మహారాష్ట్రలో పెరిగిపోతున్న కోవిద్ కేసులను అదుపు చేసేందుకు ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ముంబైలో 24 గంటల్లో డ్రైవ్-ఇన్-వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జోన్ లోనూ వీటిని నిర్వహిస్తామని ముంబై మున్సిపల్ అధికారులు తెలిపారు. అంధేరి స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, శివాజీ స్టేడియం, మిగ్ గ్రౌండ్, రిలయన్స్ జియో గార్డెన్ వంటి అనేక చోట్ల ఈ వ్యాక్సినేషన్ సెంటర్లను నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. వృద్దులు,మహిళలకు ఈ సెంటర్లలో వ్యాక్సిన్ ఇచ్చే అంశానికి ప్రాధాన్యమిచ్చినట్టు వారు చెప్పారు. అలాగే వీరితో బాటు కోవిద్ రోగులకు కూడా తాత్కాలిక సౌకర్యాలను కల్పించినట్టు వారు చెప్పారు. స్టాఫ్ కి కూడా తగిన వసతి ఉంటుందని, ఈ ప్రయోగం సఫలమైతే నగరంలో మరిన్ని జోన్లలో ఈ విద్జమైన సెంటర్లను నిర్వహహిస్తామని వారు చెప్పారు. మొదట దాదర్ లో తొలిసారిగా ఈ విధమైన సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఆ ప్రాజెక్టు విజయవంతమైందని దాంతో ఇక ఈ ప్రయోగాన్ని విస్తరిస్తామని వారు పేర్కొన్నారు. దేశంలో ..ముఖ్యంగా ముంబైలో పాజిటివిటీ రేటును అధికారులు తక్కువ చేయగలిగారు. ఈ నగర ఆక్సిజన్ మేనేజ్ మెంటును హైకోర్టులు కూడా ప్రశంసించాయి. కానీ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో మాత్రం ఆక్సిజన్ కొరత కొనసాగుతూనే ఉంది.కాగా ఇలా డ్రైవ్ ఇన్ సెంటర్లను ఇతర జిల్లాల్లో కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు
మహారాష్ట్రలో కోవిద్ కేసులు పెరిగిపోతున్నప్పటికీ రికవరీ రేటు కూడా ఎక్కువే ఉంది. ఢిల్లీతో పోలిస్త్జే ఈ రాష్ట్రంలో కేసులు ఒక్కోరోజున ఎక్కువగా మరో రోజున తక్కువగా నమోదవుతున్నాయి. ఇటీవల ఒక్క రోజులోనే 68 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. .

మరిన్ని ఇక్కడ చూడండి: టీమిండియా క్రికెటర్ ఇంట్లో వరుస విషాదాలు.. కరోనాతో మొన్న అమ్మ.. నేడు అక్క.. ఎమోషనల్ ట్వీట్..

హిమాలయాల మీదుగా విమానాలు ఎందుకు ప్రయాణించవు..! తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు…!