డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 50 కోట్ల విలువైన డ్రగ్స్‌ని సీజ్ చేశారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్‌పోర్టులో హెరాయిన్‌తో ఇథియోపియన్ జాతీయుడిని అరెస్టు చేశారు. DRI అధికారులు ఒక ఆపరేషన్ సమయంలో ముంబై విమానాశ్రయంలో 50 కోట్ల విలువైన 7.9 కిలోల పౌడర్ హెరాయిన్‌తో ఇథియోపియన్ జాతీయుడిని పట్టుకున్నారు.
నవంబర్ 25న అడిస్ అబాబా నుండి ముంబైకి ప్రయాణిస్తున్న ప్రయాణీకుల ద్వారా కొన్ని మాదక ద్రవ్యాలు భారతదేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయనే పక్కా సమాచారంతో DRI, ముంబై జోనల్ యూనిట్ విస్తృత తనిఖీలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు 7.9 కిలోలు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.50 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
అనుమానాస్పద ప్రయాణీకులను DRI అధికారుల బృందం గుర్తించి, అడ్డుకున్నారు. ట్రాలీ బ్యాగ్‌లలో తెలివిగా దాచిపెట్టిన లేత గోధుమరంగు పౌడర్‌తో కూడిన కొన్ని ప్యాకెట్లు రికవరీ చేసిన అధికారులు..వాటిని టెస్ట్‌లకు పంపించారు. ఆ పౌడర్‌లో హెరాయిన్ ఉన్నట్లు పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. మొత్తం 7.9 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత వస్తువుల అక్రమ అంతర్జాతీయ మార్కెట్ విలువ రూ.50 కోట్లకు పైనే ఉంటుందని తేల్చారు. ప్రయాణికులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. దీని వెనుక ఉన్న డ్రగ్స్ స్మగ్లింగ్ సిండికేట్‌ను ఛేదించేందుకు ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి