DRDO Abhyas: లక్ష్యం వైపు దూసుకెళ్లిన ‘అభ్యాస్’.. డీఆర్డీవో పరీక్ష విజయవంతం..

|

Oct 23, 2021 | 6:40 AM

DRDO Abhyas Missile: భారత అమ్ములపొదిలోకి మరో శక్తివంతమైన క్షిపణి చేరింది. రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు భార రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ

DRDO Abhyas: లక్ష్యం వైపు దూసుకెళ్లిన ‘అభ్యాస్’.. డీఆర్డీవో పరీక్ష విజయవంతం..
Drdo Abhyas
Follow us on

DRDO Abhyas Missile: భారత అమ్ములపొదిలోకి మరో శక్తివంతమైన క్షిపణి చేరింది. రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు భార రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) వరుసగా క్షిపణుల ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు క్షిపణిల పరీక్షలన్నీ విజయవంతంగా జరిగాయి. తాజాగా డీఆర్డీఓ హై స్పీడ్ ఎక్స్‌పెండబుల్ ఏరియల్ టార్గెట్‌, ‘అభ్యాస్‌’ ను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చందీపూర్ టెస్ట్‌ రేంజ్‌ నుంచి దీనిని డీఆర్డీఓ ప్రయోగించింది. ఈ అభ్యాస్ క్షిపణి ప్రయోగంలో పలు సాంకేతిక అంశాలను పరిశీలించింది. గ్రౌండ్-బేస్డ్ కంట్రోలర్ నుంచి సబ్‌సోనిక్ వేగంతో ఎగిరిన అభ్యాస్‌ ముందుగా నిర్ణయించిన లక్ష్యాన్ని ఛేదించినట్లు జాతీయ వార్త సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది. వాయు టార్గెట్లకు వినియోగించే వివిధ క్షిపణి వ్యవస్థల మూల్యాంకనం కోసం.. ఈ గ్రౌండ్-బేస్డ్ కంట్రోలర్ వాహనాన్ని వినియోగిస్తారు.

భారత సాయుధ దళాల కోసం ‘అభ్యాస్‌’ను డీఆర్డీవోకు చెందిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఈ) అభివృద్ధి చేస్తోంది. ఉపరితలం నుండి గాల్లోకి, గాల్లోనే ఇంటర్‌సెప్షన్ క్షిపణులను పరీక్షించే విమానాలను ఇది స్టిమ్యులేట్‌ చేస్తుంది. టార్గెట్ రాడార్ రిఫ్లెక్టివిటీ, ఎకౌస్టిక్ మిస్ డిస్టెన్స్ ఇండికేటర్ (AMDI) వ్యవస్థను మెరుగుపరచడానికి రాడార్ క్రాస్-సెక్షన్‌తో దీనిని అభివృద్ధి చేస్తున్నారు.

పూర్తిగా స్వయంప్రతిపత్తిగా ఎగిరే అభ్యాస్‌, గ్యాస్ టర్బైన్ ఇంజిన్ ఆధారంగా నిర్దేశించిన లక్ష్యంవైపు దూసుకెళ్తుంది. నావిగేషన్ కోసం మైక్రో ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్‌లను సైతం దీనిలో ఉపయోగించారు. ఫ్లైట్‌ మార్గదర్శకత్వం, నియంత్రణను కంప్యూటర్ ద్వారా ఆటోమెటిక్ గా నిర్వహిస్తారు. టెస్టింగ్ సమయంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ అభ్యాస్ క్షిపణి అధిగమించినట్లు డీఆర్డీవో వెల్లడించింది.

Also Read:

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

PM Modi Speech Top 10 Points: వ్యాక్సినేషన్‌పై ఎదురైన ఎన్నో ప్రశ్నలు, సవాళ్లకు.. 100 కోట్ల ఘనతే సమాధానం