Bio Plastic: ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం కనుక్కొన్న డీఆర్‌డీవో.. త్వరలో బయో పెట్ బాటిల్స్ ఆవిష్కరణ

ప్లాస్టిక్‌(Plastic) వాడకం పర్యావరణ ముప్పని తెలిసినా జీవితంలో ఒక భాగంగా కొనసాగిపోతోంది. ఇలాంటి ప్లాస్టిక్ వల్ల నింగీ, నేలా, గాలీ, నీరు కాలుష్యమైపోతున్నాయి. అందుకే జూలై ఒకటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌(Single Use Plastic) బ్యాన్ ప్రారంభమైంది....

Bio Plastic: ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం కనుక్కొన్న డీఆర్‌డీవో.. త్వరలో బయో పెట్ బాటిల్స్ ఆవిష్కరణ
Brdo Bio Plastic
Follow us
Ganesh Y - Input Team

| Edited By: Ganesh Mudavath

Updated on: Jul 01, 2022 | 6:43 PM

ప్లాస్టిక్‌(Plastic) వాడకం పర్యావరణ ముప్పని తెలిసినా జీవితంలో ఒక భాగంగా కొనసాగిపోతోంది. ఇలాంటి ప్లాస్టిక్ వల్ల నింగీ, నేలా, గాలీ, నీరు కాలుష్యమైపోతున్నాయి. అందుకే జూలై ఒకటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌(Single Use Plastic) బ్యాన్ ప్రారంభమైంది. చిన్నచిన్న ఇయర్‌ బడ్స్ నుంచి చేతి సంచుల వరకూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లో ఉన్నాయి. మరి వీటికి ప్రత్యామ్నాయం ఏంటి? ఈ ప్రశ్నలోంచే డీఆర్‌డీవో కొత్త ఆవిష్కరణ ప్రారంభమైంది. ఏడాదికాలం పాటు సాగిన ప్రయోగం ఫలించింది. ప్లాస్టిక్ కు బదులు బయో ప్లాస్టిక్ కు రూపకల్పన జరిగింది. డీఆర్‌డీవో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ వీరబ్రహ్మం ఏడాదిపాటు పరిశోధన చేశారు. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా బయోప్లాస్టిక్ ను రూపొందించారు. మొక్కజొన్న తో బయో ప్లాస్టిక్ ను రూపొందించి పర్యావరణానికి.. ప్రాణకోటికి ఎలాంటి నష్టం లేకుండా చేశారు. ఈ బయో ప్లాస్టిక్ తో ముందుగా చేతి సంచులను తయారు చేయడం ప్రారంభించామంటున్నారు డాక్టర్ వీరబ్రహ్మం. ఒక ట్రైట్‌ బేస్ గా తిరుమల తిరుపతిలో బయో ప్లాస్టిక్ సంచుల వినియోగం ప్రారంభించామని, ఇవి మంచి ఫలితాలను ఇస్తున్నాయంటున్నారు. మొక్కజొన్నతో తయారుచేసిన ఈ బయో ప్లాస్టిక్ వల్ల ఎలాంటి హానీ లేదని నెల రోజుల్లో భూమిలో, నీటిలో ఇది ఎరువుగా మారిపోతుందంటున్నారు.

వీటి తయారీకి ప్రత్యేకంగా యంత్రాలు తయారుచేయాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ప్లాస్టిక్ సంచులు తయారు చేస్తున్న ఫ్యాక్టరీలో చిన్న మార్పులతో బయో ప్లాస్టిక్ ఉత్పత్తి సాగిపోతుందంటున్నారు. అందుకే.. ఇప్పటికే.. 20కి పైగా కంపెనీలు ముందుకు వచ్చాయని..వీటికి ఈ టెక్నాలజీని ఉచితం గా డీఆర్‌డీవో అందిస్తోందంటున్నారు. సింగల్ యూసేజ్ ప్లాస్టిక్ లో అతిపెద్ద ఉత్పత్తి క్యారీ బ్యాగ్స్ లోనే జరుగుతోందని, అందుకే వీటిపై దృష్టిపెట్టామంటున్నారు డీఆర్‌డీవో శాస్త్రవేత్త వీరబ్రహ్మం. దేశవ్యాప్తంగా drdo టెక్నాలజీ తో ప్లాస్టిక్ సంచులు తయారీకి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామంటున్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే.. తాము డీఆర్‌డీవో సహకరిస్తోందంటున్నారు.

ప్లాస్టిక్ వల్ల ముంచుకొస్తున్న ముప్పు అంతా ఇంతాకాదు. సముద్రాలను సైతం ప్లాస్టిక్‌ వ్యర్థాలతో కప్పేస్తున్నాం. ప్లాస్టిక్ వల్ల లక్షల సంఖ్యలో పక్షులు, అనేక మూగ జంతువులు ప్రాణాలు వదులుతున్నాయి. భూమి అంతర్భాగంలో కరగలేక విషవాయువులు వెలువరిస్తూ మన ఊపిరితిత్తులు తినేస్తున్నాయి. అందుకే ముందుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ నిషేదం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఉత్పత్తులు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ల కింద – వస్తువుల ప్యాకేజింగ్ నుంచి సీసాలు-షాంపూ, డిటర్జెంట్, సౌందర్య సాధనాలు), పాలిథిన్ బ్యాగ్‌లు, ఫేస్ మాస్క్‌లు, కాఫీ కప్పులు, క్లాంగ్ ఫిల్మ్, చెత్త బ్యాగ్‌లు, ఫుడ్ ప్యాకేజింగ్ వంటి వాటి ఉత్పత్తులు ఉన్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించారు. తయారీ, ఎగుమతులు, నిల్వ, పంపిణీ, విక్రయాల కోసం వినియోగిస్తున్న 19 నిషేధిత సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఐటెమ్స్‌ (SUP) కు ప్రత్యమ్నాయాలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది.

ఇవి కూడా చదవండి
Dedo Bio Plastic

Dedo Bio Plastic

అందుకే డీఆర్‌డీవో లాంటి కీలకమైన సంస్థలు ముందుకు వస్తున్నాయి. అందులో భాగమే ఇప్పుడు బయో ప్లాస్టిక్ తో సంచుల తయారీ ప్రయోగం. త్వరలో ఈ బయో ప్లాస్టిక్ తో పెట్ బాటిల్స్ తయారీ పై పరిశోధన చేస్తున్నామంటున్నారు ఛీఫ్‌ సైంటిస్ట్ డాక్టర్ వీరబ్రహ్మం. అంటే ఇక భవిష్య త్‌ లో మొక్కజొన్నతో తయారుచేసిన పెట్‌బాటిల్స్ ను చూడబోతున్నాం. మరి ఈ బయో ప్లాస్టిక్ తయారీకి మొక్కజొన్ననే ఎందుకు ఎంచుకున్నారు అంటే… దీనికి ప్రత్యేకమైన కారణాలేఉన్నాయంటున్నారు డాక్టర్ వీరబ్రహ్మం. మొక్కజొన్న మనదేశంలో విరివిగా దొరుకుతుంది. మరోవైపు దీని ద్వారా వచ్చే గంజిలాంటి పదార్థం వస్తు ఉత్పత్తికి చాలా సూటవుతోంది. అంతకంటే ముఖ్యంగా మొక్కజొన్న కు చాలా తొందరగా బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అందుకే… అది మట్టిలో చాలా వేగంగా కలపిపోతుంది.

ఈ కారణాలన్నింటితో బయో ప్లాస్టిక్ తాయారీకి మొక్కజొన్నను ఎంచుకున్నామంటున్నారు డిఆర్‌డివో డాక్టర్ వీరబ్రహ్మం. డీఆర్‌డీవో చైర్మన్ సతీష్‌ రెడ్డి, డీఆర్‌డీవో డైరెక్టర్‌ రామమనోహర బాబు సహకారమే ఈనూతన ఆవిష్కరణ ఇంత వేగంగా రావడానికి కారణమంటున్నారు వీరబ్రహ్మం.

వై.గణేశ్, టీవీ9 తెలుగు, హైదరాబాద్‌

ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!