Maharashtra Results: మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాందేడ్‌ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వసంత్‌ చవాన్‌ విజయం సాధించారు. అయితే అనారోగ్యంతో ఆయన కన్నుమూయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సంతుక్‌రావ్‌ చేతిలో..

Maharashtra Results: మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
Follow us
Subhash Goud

|

Updated on: Nov 23, 2024 | 9:27 PM

దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపబోతోంది మహారాష్ట్ర ఫలితం. మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ ఇక స్పీడ్‌ పెంచబోతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై గట్టిగా గురిపెట్టబోతోంది. వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ దిశగా అడుగులేసేందుకు కమలదళం సిద్ధమవుతోంది. దేశమంతా కాషాయజెండా ఎగరాలన్న బీజేపీ లక్ష్యానికి.. బలం చేకూర్చింది మహారాష్ట్ర ఫలితం. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుత భారీ మెజార్టీతో గెలుపొందినట్లు కనిపిస్తోంది. బీజేపీ రికార్డులన్నీ బద్దలు కొట్టింది. బీజేపీ 130కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తోంది. కాగా షిండే వర్గం 55 సీట్లకు పైగా విజయం సాధిస్తోంది. మహాకూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకుంటోంది. అజిత్ పవార్ వర్గం కేవలం 53 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. వీరిలో 41 మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో అతని ప్రియమైన సోదరీమణులు కూడా ఉన్నారు. అజిత్ పవార్ ప్రియతమ సోదరీమణులను ప్రజలు భారీ ఓట్లతో గెలిపించారు.

ఎన్నికల ముందు ప్రచారంలో అజిత్ పవార్ చాలాసార్లు లడ్క్యా బహినే యోజన గురించి ప్రస్తావించారు. అజిత్ పవార్ గ్రూపు నుంచి నలుగురు మహిళా అభ్యర్థులు విజయం సాధించారు. అంటే అజిత్ పవార్ గ్రూపులోని నలుగురు సుందరమైన సోదరీమణులు ప్రజల ఆశీస్సులు పొందారు. ప్రస్తుతం 288 సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ 234 సీట్లు ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్‌ 48 స్థానాలు, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

అయితే ఈ ఎన్నికల్లో దారుణంగా పడిపోయింది కాంగ్రెస్‌ పార్టీ బలం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 44 సీట్లను గెలుచుకున్న హస్తం పార్టీ.. ఈ సారి భారీగా తన సీట్లను కోల్పోయింది. ఆ మేరకు బీజేపీ సీట్ల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. కంచుకోటగా భావించిన నియోజకవర్గాల్లో సైతం ఈ ఎన్నికల్లో గల్లంతయింది హస్తం పార్టీ. నాందేడ్‌ లోక్‌సభతో స్థానంతో పాటు నాందేడ్‌ నార్త్‌, సౌత్‌ స్థానాల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ ఓటమిపాలయింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాందేడ్‌ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వసంత్‌ చవాన్‌ విజయం సాధించారు. అయితే అనారోగ్యంతో ఆయన కన్నుమూయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సంతుక్‌రావ్‌ చేతిలో.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చవన్‌ రవీంద్ర వసంత్‌రావ్‌ ఓటమిపాలయ్యారు.

మహారాష్ట్రలో 11 జిల్లాలున్న విదర్భ ప్రాంతాన్ని అధికారానికి కీలకంగా భావిస్తారు. ఇక్కడ ఉన్న 62 స్థానాల్లో కొన్నేళ్లుగా బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా మహావికాస్‌ అఘాఢీ 10 మంది ఎంపీలను దక్కించుకొంది. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమదే హవా అనుకుంది. కానీ ప్రచారం మొదలయ్యాక, ఎన్నికల దగ్గర పడ్డాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖాముఖి తలపడ్డ స్థానాల్లో దాదాపు 40 సీట్లలో మహాయుతి విజయం సాధించింది. ఇక్కడి ఓటర్లను ఆకట్టుకొనేందుకు కాంగ్రెస్‌ చేసిన ప్రచారం అంతగా ఫలితం చూపలేదు. సోయా రైతులకు రూ.7,000 మద్దతు ధర ఇస్తామని చెప్పినా ఫలించలేదు. మరోవైపు మహావికాస్‌ అఘాడీలో సీట్ల సర్దుబాటు వేళ తలెత్తిన విభేదాలు కూడా ఎన్నికలపై ప్రతికూల ప్రభావం చూపాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి