Draupadi Murmu: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ప్రధాని మోడీ ఏమన్నారంటే..

| Edited By: Team Veegam

Jun 22, 2022 | 4:30 PM

Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరపున అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. బీజేపీ కూటమి (NDA) తన అభ్యర్థిగా జార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపతి..

Draupadi Murmu: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ప్రధాని మోడీ ఏమన్నారంటే..
Follow us on

Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరపున అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. బీజేపీ కూటమి (NDA) తన అభ్యర్థిగా జార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపతి ముర్మును బరిలోకి దింపింది. నిన్న రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే అంశంపై సమావేశమైన బీజేపీ పార్టమెంటరీ బోర్డు సమావేశం.. దాదాపు 20 మంది పేర్లను పరిశీలించిన తర్వాత రాష్ట్రపతి అభ్యర్థిగా ఎస్టీ మహిళను చేయాలని ఏన్డీయే నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ప్రకటించారు.

ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ఇతర పార్లమెంటరీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

 


ఈ సందర్భంగా రాష్ట్రపతిగా అభ్యర్థి ద్రౌపతి ముర్ము పేరు ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు. ఏన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపతి ముర్ము ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ద్రౌపతి తన జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేశారని అన్నారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారిత కోసం ద్రౌపది ఎంతో కృషి చేశారని మోడీ కొనియాడారు. విశేష పరిపాలనా అనుభవం ఉన్న ద్రౌపది ముర్ము.. మన దేశానికి గొప్ప రాష్ట్రపతిగా నిలుస్తారనే నమ్మకం ఉందని మోడీ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి