Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూత.. ప్రధాని మోదీ నివాళి

Former PM Manmohan Singh Passed Away: కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గురువారం రాత్రి ఆయన ఎయిమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ మన్మోహన్‌ సింగ్‌ తుదిశ్వాస విడిచినట్లు ఎయిమ్స్ ఢిల్లీ ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.

Dr. Manmohan Singh Obituary: కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గురువారం రాత్రి ఆయన ఎయిమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ మన్మోహన్‌ సింగ్‌ తుదిశ్వాస విడిచినట్లు ఎయిమ్స్ ఢిల్లీ ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే ప్రియాంక గాంధీ, జేపీ నడ్డా తదితరులు ఎయిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. మన్మోహన్ కుటుంబసభ్యుల్ని ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో పరామర్శించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ బెళగావి నుంచి ఢిల్లీ బయల్దేరారు. ఈ రాత్రికే వారు ఢిల్లీ చేరుకుంటారు. ఆయన మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.

మన్మోహన్ సింగ్ మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల హోం మంత్రి అమిత్ షా సంతాపం..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మల్లికార్జున ఖర్గే సంతాపం..

మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు దేశ ప్రధానిగా సేవలందించారు. 1991లో పీవీ కేబినెట్‌లో మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు నాంధి పలకడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు.