Nizam Mir Osman Ali Khan: నిజాంను రాజకీయాల్లోకి లాగొద్దు.. ప్రధాని మోడీకి వారసుడి లేఖ.. 

|

Oct 01, 2021 | 11:58 AM

Nizam Mir Osman Ali Khan - Telangana Politics: రాజకీయ పార్టీల నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్న సమయంలో నిజాం పేరును ప్రస్తావించడం

Nizam Mir Osman Ali Khan: నిజాంను రాజకీయాల్లోకి లాగొద్దు.. ప్రధాని మోడీకి వారసుడి లేఖ.. 
Follow us on

Nizam Mir Osman Ali Khan – Telangana Politics: రాజకీయ పార్టీల నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్న సమయంలో నిజాం పేరును ప్రస్తావించడం మనం చూస్తేనే ఉన్నాం. ఎన్నికల సమయంలో నిజాం పేరు మారుమోగుతుంది. ఇది తెలంగాణ రాజకీయాల్లో గత కొన్నేళ్ల నుంచి కొనసాగుతున్న అంశమే. అయితే.. దీనిపై ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు మీర్‌ హిమాయత్‌ అలీ మీర్జా స్పందించారు. ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీపై అసభ్యకర వ్యాఖ్యలు చేయకుండా నిరోధించాలని ఆయన మనవడు మిర్జా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రతీ ఎన్నికల్లోనూ నిజాం పేరును లాగుతున్నారని.. ఆయన పేరును కించపరిస్తే.. ఇకపై ఉపేక్షించేది లేదని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీర్జా హెచ్చరించారు. ఈ విషయమై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, భారత ఎన్నికల సంఘానికి లేఖలు రాసినట్లు హిమాయత్ మీర్జా వెల్లడించారు.

తాజాగా హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో.. జరిగిన ఎన్నికల ప్రచారాల్లోనూ నిజాం చరిత్రను వక్రీకరించి మాట్లాడారని.. దీనిపై తాను చర్యలకు సిద్ధమయ్యానని తెలిపారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. రాజకీయ ప్రసంగాల్లో నిజాం పేరును వాడొద్దంటూ హిమాయత్‌ అలీ మీర్జా కోరారు. రాజకీయ ప్రత్యర్థులను కించపరచడానికి నిజాంను విలన్‌గా చిత్రీకరిస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన కాలం క్రితం మరణించారని.. నిజాం ఏ రాజకీయ పార్టీలోనూ భాగం కాదని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజా సమస్యలపై మాట్లాడి గెలవాలి కానీ.. రాజకీయాలతో సంబంధం లేని నిజాం పేరును ఎందుకు లాగాలంటూ ఆయన ప్రశ్నించారు.

హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వంలో వీలినం అయినప్పుడు.. ప్రభుత్వం నిజాంను రాజ్ ప్రముఖ్, హైదరాబాద్ రాష్ట్ర గవర్నర్‌గా నియమించిందని హిమాయత్ అలీ మీర్జా గుర్తుచేశారు. ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగారని.. నిజాంపై ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదని ఆయన అన్నారు. నిజాం విరాళాలు, చేసిన సేవలను మరిచి.. ఆయన పేరును ఓట్లకోసం విలన్‌గా చిత్రీకరించడం తగదంటూ సూచించారు. ఎన్నికల సమయంలో నిజాంపై చేస్తున్న ఆరోపణలను నిరోధించేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రెండవ కుమారుడు మొజ్జామ్ మనవడు మీర్జా కోరారు.

Also Read:

Huzurabad: నేడు హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్, వ్యూహాలు అమలు చేయబోతున్న పార్టీలు.. ఇదీ యాక్షన్ ప్లాన్.!

Somu Veerraju: ‘ఈ రంగులేంటీ.. ఈ లోకమేంటి..’ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్