సీఎం అమరేందర్ సింగ్ ని తప్పించకండి.. పార్టీ అధిష్టానానికి 10 మంది పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల లేఖ..సిద్దు వ్యవహారం మళ్ళీ మొదటికి

| Edited By: Phani CH

Jul 18, 2021 | 5:17 PM

పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ ని తప్పించవద్దంటూ పార్టీ అధిష్టానానికి రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 10 మంది లేఖ రాశారు.

సీఎం అమరేందర్ సింగ్ ని తప్పించకండి.. పార్టీ అధిష్టానానికి 10 మంది పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల లేఖ..సిద్దు వ్యవహారం మళ్ళీ మొదటికి
Amarinder Singh
Follow us on

పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ ని తప్పించవద్దంటూ పార్టీ అధిష్టానానికి రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 10 మంది లేఖ రాశారు. అమరేందర్ సింగ్ కి ఇప్పటికీ రాష్ట్రంలోనూ, ప్రజల్లోనూ ఉన్నత స్థానం ఉందని, 1984 లో దర్బార్ సాహిబ్ పై దాడి తరువాత రాష్ట్రంలో తిరిగి పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన ఎంతో కృషి చేశారని వారు ఈ లేఖలో పేర్కొన్నారు. 2004 లో వాటర్స్ అగ్రిమెంట్ రద్దు అయ్యేలా ఆయన చూశారని, రైతుల పక్షపాతి అని వారన్నారు. రాష్ట్ర పీసీసీ చీఫ్ ను నియమించే అధికారం మీకు ఉందని, కానీ ఇదే సమయంలో ఈ రెండు నెలలుగా ప్రజల్లో పార్టీకి పడిన మచ్చను కూడా తొలగించాల్సి ఉందని వారు పేర్కొన్నారు. నవజ్యోత్ సింగ్ సిద్దు ..ముఖ్యమంత్రిపై చేసిన ట్వీట్లకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మీరు పార్టీకి ‘ఆస్తి’ వంటివారైనా.. మీ సొంత పార్టీని, ప్రభుత్వాన్ని మీరు విమర్శించడం వల్ల పార్టీ ప్రతిష్ట దిగజారుతుందని వారు అన్నారు. తమ అభిప్రాయాలను అధిష్టానం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మరోవైపు- ఢిల్లీలో సిద్దు ఇన్నాళ్లుగా ఉండి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కలిసి చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. అమరేందర్ సింగ్, సిద్దు ఓ రాజీ సూత్రానికి అంగీకరించినట్టు కనబడినా అది వర్కౌట్ కాలేదు.

ఢిల్లీ నుంచి పాటియాలా చేరుకున్న సిద్దు..నిన్న 30 మంది ఎమ్మెల్యేలతో సమావేశమై తన కార్యాచరణ గురించి ప్రకటించినట్టు తెలిసింది. అటు ఢిల్లీలోనే ఉన్న అమరేందర్ సింగ్ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశమై,, రాష్ట్ర పీసీసి చీఫ్ గా సిద్దు నియామకాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని సమాచారం. సో..సిద్దు పరిస్థితి, రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఆఫ్గనిస్తాన్ లో ఇండియా నిర్మిస్తున్న కట్టడాలను టార్గెట్ చేయాలని తాలిబన్లకు పాక్ ఐఎస్ఐ ఆదేశాలు..

పార్లమెంట్ సమావేశాల ముందే తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య రగడ.. ఆ కొత్త మంత్రి విదేశీయుడా ?