వివాదాస్పద మూడు చట్టాలను రద్దు చేయాలనీ కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులు తమ హద్దులు దాటరాదని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కోరారు. రాజకీయ నేతలు సహనంతో ఉంటారని… ఏది ఏమైనా ఎవరూ హద్దులు దాటరాదని ఆయన అన్నారు. పొలిటికల్ లీడర్లు గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామీణులు..ముఖ్యంగా రైతులు నిరసన తెలుపుతూ ఒక్కో సారి వారిపై దాడులకు కూడా దిగుతుంటారని ఆయన అన్నారు. అయితే ప్రజలను కలుసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందని ఆయన చెప్పారు. బుధవారం యూపీ-ఢిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపూర్ లో రైతులకు, స్థానిక బీజేపీ కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఖట్టర్ ఆవేదనా భరితంగా మాట్లాడారు. ఈ ఘర్షణలు ఎవరికీ మంచివి కావన్నారు. కాగా ఈ అల్లర్లలో దాదాపు 10 వాహనాలు నాశనమయ్యాయి. రైతు చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న అన్నదాతలపై ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘర్షణల్లో కొందరు గాయపడ్డారు.
అసలు రైతు అన్న పదం పవిత్రమైనది, స్వచ్ఛమైనదని, కానీ కొన్ని దురదృష్టకర ఘటనల కారణంగా ఇది మసకబారిందని ఖట్టర్ పేర్కొన్నారు. దేశంలో హత్యలు జరుగుతున్నాయి.. రోడ్లను దిగ్బంధం చేస్తున్నారు.. ఇవి ప్రజాస్వామ్య విరుద్ధమైనవి కావా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నాయకులకైనా.. రైతులకైనా..ఎవరికైనా సహనం అవసరం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా ఉండగా రైతు చట్టాలను రద్దు చేయాలంటూ పంజాబ్, హర్యానా, యూపీలోని కొన్ని ప్రాంతాలకు చెందిన అన్నదాతలు ఢిల్లీ సరిహద్దుల్లో ఇంకా ప్రొటెస్ట్ కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్ తీరేవరకు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసేది లేదని హెచ్చరిస్తున్నారు. కనీస మద్దతు ధరకు లీగల్ గ్యారంటీ ఇవ్వాలని కూడా వారు కోరుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: TS Ed CET-2021: తెలంగాణ ఎడ్‌సెట్-2021 దరఖాస్తుల సమర్పణకు గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే..
జమ్ముకశ్మీర్‌లో డ్రోన్ టెర్రర్.. వరుసగా నాలుగో రోజు కూడా ఎయిర్‌బేస్, ఆర్మీ బేస్‌లపై సంచారం