Dog Tied to Bike With Rope: అన్ని తెలిసిన మనిషి.. మంచి చెడు విచక్షణ మరచి మృగంగా మారుతున్నాడు.. మూగజీవుల పట్ల తన పైశాచికత్వాన్ని చూపిస్తూ.. క్రూరమైన చర్యలకు పాల్పడుతునున్నాడు. ఓ వ్యక్తి ఒక కుక్కను తాడుతో బైక్ కు కట్టి కిలోమీటర్ మేర ఈడ్చుకుని వెళ్ళాడు.. దీంతో అది తీవ్రంగా గాయపడి మరణించింది. ఈ దారుణ ఘటన గుజరాత్ లోని సూరత్ లో చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో సలోని రతి అనే యువతి స్పందించి ఖతోదర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
వీడియో సాయంతో బైక్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఉపయోగించి పోలీసులు నిందితుల్లో ఒకరిని హితేష్ పటేల్ గా గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దారుణానికి పాల్పడిన హితేష్ పటేల్, బైక్ నడిపిన అతడి స్నేహితుడిపై కేసు నమోదు చేసి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పటేల్ సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ లో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వెసులోని భగవాన్ మహావీర్ కళాశాల సమీపంలో ఈ వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
అయితే ఆ కుక్క మరణించిందని.. అందుకనే దూరంగా పడేయడానికి అలా తీసుకెళ్లానని హితేష్ చెప్పాడు.. అయితే వీడియో లో కుక్క కదలికలున్నాయని.. జంతు ప్రేమికులు చెప్పారు. ఇక పోలీసులు పటేల్ తో పాటు ఉన్న మరోవ్యక్తిని కనిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: