DMM Hospital: ప్రసవ వేదనతో గర్భిణీ మృతి.. తల్లి గర్భంలో శిశువు బతికే ఉందని గుర్తించి ప్రాణం పోసిన వైద్యులు..ఎక్కడంటే

|

Nov 11, 2021 | 4:17 PM

DMM Hospital: శిశువుకు జన్మనివ్వడం అంటే మహిళకు పునర్జన్మ వంటిది అని అంటారు పెద్దలు..  ఓ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఆ మహిళ పడే ప్రసవ వేదన గురించి ఎంత చెప్పినా..

DMM Hospital: ప్రసవ వేదనతో గర్భిణీ మృతి.. తల్లి గర్భంలో శిశువు బతికే ఉందని గుర్తించి ప్రాణం పోసిన వైద్యులు..ఎక్కడంటే
Dmm Doctors
Follow us on

DMM Hospital: శిశువుకు జన్మనివ్వడం అంటే మహిళకు పునర్జన్మ వంటిది అని అంటారు పెద్దలు..  ఓ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఆ మహిళ పడే ప్రసవ వేదన గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు కొందరు. అదే సమయంలో డాక్టర్లు నడిచే దేవుళ్ళుగా భావించి కొలుస్తారు. ఈ రెండు సంఘటనలు కలగలిపిన ఓ హృదయ విదారకైనా విచిత్రమైన డెలివరీ ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. నెలలు నిండిన గర్భిణీ ప్రసవ వేదనతో బాధపడుతుంటే.. ఆమెను డెలివరీ నిమిత్తం ఆస్పత్రికి తీసుకొని వచ్చారు. ఆ మహిళ ఆస్పత్రికి రావడానికి ముందే మరణించిందని వైద్యులు చెప్పారు.  అయితే ఆ మహిళా గర్భంలోని శిశువు బతికే ఉందని గమనించిన వైద్యులు.. వేంటనే ఆపరేషన్ చేసి.. చిన్నారిని బయటకు తీశారు. ఈ ఘటన కర్ణాటక లోని గడగ్ జిల్లాలో నవంబర్ 4వ తేదీన చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

గడగ్ జిల్లా రోనా తాలూకా ముషిగేరికి చెందిన అన్నపూర్ణ అబ్బిగేరి నిండు గర్భిణీ.. నవంబర్ 4న ప్రసవ వేదన పడుతుంది. గర్భిణి అన్నపూర్ణ లో బీపీ, మూర్ఛ వ్యాధితో బాధపడుతోంది. ఇంటి నుంచి ఆస్పత్రికి తీసుకొచ్చే సమయంలో మార్గ మధ్యలోనే గర్భిణీ మృతి చెందింది. అయితే DMM మెటర్నిటీ హాస్పిటల్‌లో డాక్టర్ స్కాన్ చేయగా శిశువు గుండె చప్పుడుని గుర్తించారు. పాపా తల్లి గర్భంలో ప్రాణంతో ఇంకా కొట్టుమిట్టాడుతోందని గుర్తించారు. వెంటనే దండప్ప మాన్వి మహిళా, పిల్లల ఆస్పత్రి వైద్యులు డాక్టర్ కుటుంబీకులతో చర్చించారు. 10 నిమిషాల్లోనే మరణించిన గర్భిణీకి  ఆపరేషన్‌ చేశారు. ఆపరేషన్‌ చేసిన వైద్య బృందం చిన్నారిని సజీవంగా బయటకు తీశారు. నవంబర్ 4న జరిగిన ఈ  అరుదైన ఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం ఈ శిశువు  డాక్టర్ల పర్యవేక్షణలో ఉంది.  ప్రాణాలతో బయటపడిన పాపపై వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. శిశువు రోజురోజుకూ కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. దీనిపై స్పందించిన చిన్నారి తండ్రి తనకు అన్నపూర్ణ తో పెళ్లయి ఏడాది అయిందని చెప్పాడు. ఇప్పుడు నా భార్య పోయింది.  అయితే తన గుర్తుగా ఈ చిన్నారిని ఇచ్చింది అంటూ కన్నీరు పెడుతుంటే.. చూపరులు కూడా కన్నీరు పెడుతున్నారు.

Also Read:  త్వరలో భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు..వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే ఛాన్స్..