Uttarkashi Tunnel Rescue: ఉత్తరాఖండ్‌ సొరంగం కథ సుఖాంతం.. 41 మంది కార్మికులు 17 రోజులపాటు ఎలా గడిపారంటే

|

Nov 29, 2023 | 7:19 AM

సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటికి వచ్చారు. 17 రోజులుగా సొరంగంలోనే గడిపిన 41 మంది ఎట్టకేలకు సురక్షితంగా బయటకు రాగలిగారు. భారీ యంత్రాలు మొరాయించినా, సాంకేతిక నిపుణుల వ్యూహాలు ఫలించకపోయినా.. కూలీలు చేతులతో నేర్పుగా తవ్విన సొరంగం ఆ 41 మందికి ప్రాణభిక్ష పెట్టింది. తొలుచుకుంటూ వెళ్లిన మార్గం మేరకు వెడల్పైన పైపుగొట్టాలను ప్రవేశపెట్టి నిష్క్రమణ మార్గాన్ని సిద్ధం చేయడంతో మంగళవారం రాత్రి కూలీలంతా..

Uttarkashi Tunnel Rescue: ఉత్తరాఖండ్‌ సొరంగం కథ సుఖాంతం.. 41 మంది కార్మికులు 17 రోజులపాటు ఎలా గడిపారంటే
Uttarkashi Tunnel Rescue
Follow us on

ఉత్తరకాశీ, నవంబర్‌ 29: సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటికి వచ్చారు. 17 రోజులుగా సొరంగంలోనే గడిపిన 41 మంది ఎట్టకేలకు సురక్షితంగా బయటకు రాగలిగారు. భారీ యంత్రాలు మొరాయించినా, సాంకేతిక నిపుణుల వ్యూహాలు ఫలించకపోయినా.. కూలీలు చేతులతో నేర్పుగా తవ్విన సొరంగం ఆ 41 మందికి ప్రాణభిక్ష పెట్టింది. తొలుచుకుంటూ వెళ్లిన మార్గం మేరకు వెడల్పైన పైపుగొట్టాలను ప్రవేశపెట్టి నిష్క్రమణ మార్గాన్ని సిద్ధం చేయడంతో మంగళవారం రాత్రి కూలీలంతా ఒక్కొక్కరుగా బయటి ప్రపంచంలోకి వచ్చారు.

28 గంటల పాటు నిరంతరం శ్రమించి 18 మీటర్ల మేర తవ్వి కార్మికుల వద్దకు చేరుకున్నారు. ర్యాట్‌ హోల్‌ మైనర్‌ నాసిర్ తొలుత సొరంగంలోకి ప్రవేశించగానే ఆనందంతో అక్కడున్న కార్మికులంతా అతన్ని కౌగలించుకున్నారు. రెస్క్యూ టీమ్ వారిని సురక్షితంగా రక్షిస్తారనే తమ నమ్మకం నిజం చేశారని ఆనందంతో అన్నారు. ర్యాట్‌ హోల్‌ మైనర్ నసీర్ తెలిపిన వివరాల ప్రకారం.. సిల్క్యారా సొరంగం లోపల 200 మీటర్ల మేర శిథిలాలు కూలిపోయిన ప్రదేశం నుంచి తవ్వుకుంటూ వారివద్దకు చేరుకున్నారు. దాదాపు రెండు నుంచి రెండున్నర కిలోమీటర్ల పొడవు ఉంది. వారి వద్దకు చేరుకోగానే 17 రోజులు తాము గడిపిన విధానాన్ని ర్యాట్‌ మైనర్లకు వివరించారు. కార్మికులు పడుకున్న ప్రదేశాలు, వారు ఎలా నడిచేవారో, వారు ఎక్కడ కూర్చునేవారో.. వంటి విషయాలు వివరించారు.

సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సమయం గడపడానికి జుగాడ్‌తో ఆటలు ఆడేవారు. యోగా, వాకింగ్ చేసేవారు. రిలీఫ్ టీమ్ ద్వారా బ్యాట్ బాల్స్, మొబైల్ ఫోన్లు అందిన తర్వాత, వాటిల్లో వారు క్రికెట్ ఆడేవారు. సినిమాలు కూడా చూసేవారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికుల వద్దకు ర్యాట్‌ మైనర్లు చేరుకోగానే వారిని కౌగిలించుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ర్యాట్ మైనర్లు 28 గంటలు నిరంతరంగా పనిచేశారు. మొత్తం 18 మీటర్ల మాన్యువల్ డ్రిల్లింగ్ చేశారు. దీని కోసం చిన్న డ్రిల్ మిషన్, గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించామని, వాటి మధ్య కొన్ని లోహాలతో కూడిన విరిగిన పైపులు ఉన్నాయని తెలిపారు. 32 ఎంఎం రీబార్‌ ఇనుప ముక్కలతో పాటు అనేక అడ్డంకులు వచ్చాయన్నారు. వాటిని గ్యాస్ కట్టర్‌లతో కోసుకుని ముందుకు వెళ్లామని ర్యాట్‌ మైనర్లు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఒకేసారి లోపలికి వెళ్లేలా.. చేతులతో మట్టిని తవ్వారు. దానిని చిన్ని చిన్న పాన్‌లలో నింపి తాడుతో బయటకు తీసేవారు. ఇక బులంద్‌షహర్, ఢిల్లీ, కాస్‌గంజ్ నుంచి వచ్చిన ర్యాట్‌ మైనర్లు ఈ పనులను చేపట్టిన సంగతి తెలిసిందే. కొండను క్రాల్ చేయడం, డ్రిల్ చేయడం అంత సులభం కాదని, అయితే తమకు అందులో అనుభవం ఉందని వారు చెప్పారు.

కాగా 17 రోజులుగా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు. వీరిలో అత్యధికంగా 15 మంది కూలీలు జార్ఖండ్‌కు చెందిన వారు కాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు 8 మంది, బీహార్‌కు చెందిన వారు ఐదుగురు, ఒరిస్సాకు చెందిన వారు ఐదుగురు, బెంగాల్‌కు చెందిన వారు ముగ్గురు, అస్సాంకు చెందిన వారు ఇద్దరు, ఉత్తరాఖండ్‌కు చెందిన వారు ఇద్దరు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ కూలీ ఉన్నారు. వీరంతా నవంబర్ 12వ తేదీన రాత్రి టన్నెల్‌లో పనిచేస్తున్న సమయంలో, సొరంగం మట్టి కూలిపోవడంతో అందరూ అందులో చిక్కుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.