DK Shivakumar: కాంగ్రెస్ గెలుపు కోసం ఎంతో కష్ట పడ్డా.. సీఎం పదవిపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు..

|

May 15, 2023 | 4:51 PM

సీఎం పదవిపై డీకే శివకుమార్‌, సిద్దరామయ్య పట్టువీడటం లేదు.. దీంతో కర్ణాటక సీఎం ఎవరన్నది ఉత్కంఠ నెలకొంది. ఘన విజయం సాధించినప్పటికీ.. ఇద్దరు కీలక నేతలు సీఎం పదవి కోసం పట్టుబట్టడంతో.. కర్నాటక రాజకీయాలు ఢిల్లీకి చేరాయి.

DK Shivakumar: కాంగ్రెస్ గెలుపు కోసం ఎంతో కష్ట పడ్డా.. సీఎం పదవిపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు..
Dk Shivakumar
Follow us on

సీఎం పదవిపై డీకే శివకుమార్‌, సిద్దరామయ్య పట్టువీడటం లేదు.. దీంతో కర్ణాటక సీఎం ఎవరన్నది ఉత్కంఠ నెలకొంది. ఘన విజయం సాధించినప్పటికీ.. ఇద్దరు కీలక నేతలు సీఎం పదవి కోసం పట్టుబట్టడంతో.. కర్నాటక రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. సీఎం ఎవరన్న విషయంపై అతిత్వరలో క్లారిటీ రానుంది. ఈ క్రమంలో డీకే శివకుమార్ తన అనుచరులతో సమావేశమయ్యారు. అనంతరం శివకుమార్ తన ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డానంటూ పేర్కొన్నారు. సోనియా, రాహుల్, ఖర్గే సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని తెలిపారు. తన అధ్యక్షతన 135 మంది ఎమ్మెల్యేలను గెలుపించుకున్నానని.. 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా.. ధైర్యం కోల్పోకుండా ఒంటరిగా పోరాడానని తెలిపారు. కాంగ్రెస్ నేతలందరికీ ఏకతాటిపైకి తీసుకువచ్చానని తెలిపారు.

సీఎం ఎవరన్నది హైకమాండ్‌ నిర్ణయిస్తుందని.. సిద్ధరామయ్యతో ఎలాంటి విబేధాలు లేవని డీకే శివకుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలంతా గెలుపు కోసం పనిచేశారని.. సిద్ధరామయ్య కూడా తన బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు. ఇప్పుడే తన మద్దతుదారుల సంఖ్యను చెప్పబోనంటూ డీకే స్పష్టంచేశారు.

డీకే శివకుమార్ ఇంట్లోనే ఉండగా.. సిద్ధరామయ్య మాత్రం ఢిల్లీ పయనమయ్యారు. కాసేపట్లో ఖర్గేతో సమావేశం కానున్నారు. అనంతరం సోనియాతో భేటీ కానున్నారు. ఇద్దరు నేతలు కూడా సీఎం పదవి కోసం పట్టుబట్టడంతో.. అధిష్టానం ఎవరికిస్తుందనేది ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..