Watch Video: టపాసులు వెలిగించి.. బైక్ గాల్లో ఎగరేస్తూ స్టంట్లు.. కట్ చేస్తే.. చివరికి దిమ్మతిరిగే ట్విస్ట్..

|

Nov 14, 2023 | 1:30 PM

టపాసులు కాల్చేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిచూపుతారు. అయితే బైక్ ముందు భాగంలో రాకెట్ బాంబులు కట్టి బైక్ గాల్లో ఎగిరేస్తూ విన్యాసాలు చేస్తే.. చూసేందుకు బాగానే ఉన్నా పూర్తి సాహసోపేతమైన చర్య అని చెప్పాలి. ఒకవేళ ప్రమాదవశాత్తు నిప్పు రవ్వలు పెట్రోల్ ట్యాంకుకు అంటుకుంటే బైక్‌తో పాటూ డ్రైవ్ చేసిన వ్యక్తి కూడా పేలిపోక తప్పదు. అయితే విచిత్రమైన చేష్టలు చేస్తూ కొందరు ఆకతాయిలు రకరకాలా స్టంట్స్ చేస్తున్నారు.

Watch Video: టపాసులు వెలిగించి.. బైక్ గాల్లో ఎగరేస్తూ స్టంట్లు.. కట్ చేస్తే.. చివరికి దిమ్మతిరిగే ట్విస్ట్..
Diwali Bomb Blasting Stunt On A Bike In Chennai Goes Viral Watch Video
Follow us on

టపాసులు కాల్చేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిచూపుతారు. అయితే బైక్ ముందు భాగంలో రాకెట్ బాంబులు కట్టి బైక్ గాల్లో ఎగిరేస్తూ విన్యాసాలు చేస్తే.. చూసేందుకు బాగానే ఉన్నా పూర్తి సాహసోపేతమైన చర్య అని చెప్పాలి. ఒకవేళ ప్రమాదవశాత్తు నిప్పు రవ్వలు పెట్రోల్ ట్యాంకుకు అంటుకుంటే బైక్‌తో పాటూ డ్రైవ్ చేసిన వ్యక్తి కూడా పేలిపోక తప్పదు.  అయితే విచిత్రమైన చేష్టలు చేస్తూ కొందరు ఆకతాయిలు రకరకాలా స్టంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం సామాజిక మాధ్యమాలు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా తెగ పాపులర్ అయిపోయింది. తమకు ఇష్టం వచ్చిన వీడియోను, ఫోటోలను చిటికెలో పోస్ట్ చేసేయొచ్చు. దీనిని చూసి వినోదభరింతగా ఎంజాయ్ చేసే వాళ్లూ లేకపోలేదు. మరికొందరు ఇలాంటి విన్యాసాలు చేయొద్దని హెచ్చరిస్తున్నా ఈ ఆకతాయిలకు బోధపడటం లేదు. మరోసారి ఇలాంటి సర్కస్ ఫీట్లు చేశారు కొందరు యువకులు.

చెన్నైలో విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ప్రజల్లో భయాందోళనను కలిగిస్తున్నారు. రీల్స్ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేలా కొన్ని సాహసోపేతమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా చేసే క్రమంలో అటుగా ఎవరైనా వస్తే వీరి కారణంగా ఏ పాపం తెలియని అమాయక ప్రజలు బలికావల్సి వస్తుంది. ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట వెలుగులోకి వస్తూ ఉంటాయి. మన్న రైలు వస్తుండగా సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేశాడు ఒక యువకుడు. ఈ సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఇప్పుడు చెన్నైకి చెందిన కొందరు యువకులు బైక్‌ ముందు భాగంలో టపాసులు కట్టి వాటిని వెలిగించి అవి పేలే క్రమంలో వాహనాన్ని గాల్లో ఎగిరేలా స్టంట్స్‌ని చేశారు. దీనిని తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. దీనిని చూసిన నెటిజన్లు అతనిపై టపాసులు పేటినట్లుగా విరుచుకుపడుతున్నారు. మరి కొందరు సూపర్ అని అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు సైతం స్పందించారు. ఇలాంటి ప్రమాదకరమైన ఫీట్లను చేసినందుకు ఆ యువకులను పట్టుకున్నారు. ఇలాంటివి మరోసారి ఎవరూ చేయకుండా ఉండేలా చర్యలు తీసుకునే క్రమంలో వారిని అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..