సాహసం చేద్దాం అనుకుంది.. సీన్ రివర్స్ అయ్యింది.. యముడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చిన యువతి.. వైరల్ వీడియో
ఊయల ఊగుతున్నప్పుడే అమ్మాయి కిందపడిపోవడంతే.. ప్రజలు ఆమెను చాకచక్యంగా పట్టుకున్నారు. కానీ భయంతో ఆ అమ్మాయి స్పృహ కోల్పోయింది. తక్షణమే ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్నారు వైద్యులు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. అలాగే, అమ్మాయికి మనో ధైర్యం కల్పించే సలహాలు, సూచనలు కూడా చేస్తున్నారు.

సాహసాన్ని ఇష్టపడే వ్యక్తులు ఎలాంటి పనినైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు..వారు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతుంటారు. సాహసం కోసం ఓ పెద్ద ఊయల ఎక్కిన ఓ అమ్మాయికి కూడా అలాంటిదే జరిగింది. కానీ, ఆమె చావు తప్పి జీవితం ప్రమాదంలో పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన చాలా మంది ప్రజలు అమ్మాయిని ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో సాహసం పట్ల ఇష్టంతో ఆమె జీవితాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. అలాగే, అమ్మాయికి మనో ధైర్యం కల్పించే సలహాలు, సూచనలు కూడా చేస్తున్నారు.
మీడియా కథనాల ప్రకారం, 2 అమ్మాయిలు స్వింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు 50 అడుగుల ఎత్తులో ఉన్న ఊయల ఒక్కసారిగా విరిగిపోవడంతో దానిపై స్వారీ చేస్తున్న ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు కిందపడిపోయారు. కానీ, ఆమె కాలు ఊయలలో ఇరుక్కుపోయింది. అలా ఆ యువతి రెండు మూడు రౌండ్లు అలానే అటు నుంచి ఇటు ఊగింది.. ఆ కింద నుంచి చూస్తున్న జనాలు భయంతో హహాకారాలు చేస్తున్నారు. కిందపడితే పెను ప్రమాదం జరుగుతుందని.. యువతి ప్రాణం కూడా పోయే అవకాశమే ఎక్కువగా ఉందని అందరూ టెన్షన్‌గా చూస్తున్నారు.. అంతలోనే ఆమె మరో కాలును కూడా ట్రాప్ చేస్తుంది. ఇది చూసి కింద నిల్చున్న వారిలో గందరగోళం నెలకొంది.
అంతలోనే స్వింగ్ ఆపరేటర్ ఊయల వేగాన్ని తగ్గించాడు. ఊయల ఊగుతున్నప్పుడే అమ్మాయి కిందపడిపోవడంతే.. ప్రజలు ఆమెను చాకచక్యంగా పట్టుకున్నారు. కానీ భయంతో ఆ అమ్మాయి స్పృహ కోల్పోయింది. తక్షణమే ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్నారు వైద్యులు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram
ఈ వీడియో @unilad అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌తో షేర్ చేశారు. ఆ అమ్మాయి కాలుకు తగిలి ఉండకపోతే ప్రాణంపోయేది. ఈ వీడియోపై ప్రజలు కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..