22 మంది రైతన్నల అరెస్ట్.. రీజన్ తెలిస్తే షాక్..!

| Edited By:

Nov 07, 2019 | 2:03 AM

దేశ రాజధానిని పట్టి పీడిస్తున్న భూతం వాయు కాలుష్యం. పొరుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఘటనలతో ఢిల్లీ వాయు కాలుష్యం బారిన పడింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట పొలాల వ్యర్థాలను అక్కడి రైతులు తగలబెడుతుంటారు. దీంతో అందులో ఉన్న కెమికల్స్‌ ప్రభావంతో.. విపరీతమైన వాయు కాలుష్యం వెలువడుతోంది. దీని ప్రభావం దేశ రాజధాని ఢిల్లీపై పడుతోంది. ఈ నేపథ్యంలో అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేసినా.. సఫలమవ్వడంలేదు. దీంతో సుప్రీం కోర్టు కూడా ఈ […]

22 మంది రైతన్నల అరెస్ట్.. రీజన్ తెలిస్తే షాక్..!
Follow us on

దేశ రాజధానిని పట్టి పీడిస్తున్న భూతం వాయు కాలుష్యం. పొరుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఘటనలతో ఢిల్లీ వాయు కాలుష్యం బారిన పడింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట పొలాల వ్యర్థాలను అక్కడి రైతులు తగలబెడుతుంటారు. దీంతో అందులో ఉన్న కెమికల్స్‌ ప్రభావంతో.. విపరీతమైన వాయు కాలుష్యం వెలువడుతోంది. దీని ప్రభావం దేశ రాజధాని ఢిల్లీపై పడుతోంది. ఈ నేపథ్యంలో అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేసినా.. సఫలమవ్వడంలేదు. దీంతో సుప్రీం కోర్టు కూడా ఈ వాయు కాలుష్యం నివారణపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ వాయు కాలుష్యానికి ముఖ్య కారణమైన పంట పొలాల వ్యర్థాల దహనంపై.. పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు సీరియస్‌గా దృష్టి సారించారు.

ఈ నేపథ్యంలో.. పంట పొలాల్లో వ్యర్థాలను తగులబెట్టిన రైతులపై పంజాబ్ సర్కార్ కొరడా ఝళిపించింది. ఈ ఘటనకు కారకులైన 22 మంది రైతులను అరెస్ట్ చేసింది. అంతేకాదు.. 45 మందిపై ఎఫ్ఐఆర్‌లు కూడా నమోదు చేసింది. ఢిల్లీలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యానికి.. ఈ పంట పొలాల వ్యర్థాలను పెద్దఎత్తున తగులబెట్టడం ఓ ముఖ్యకారణంగా మారింది.

దీంతో లూథియానా జిల్లా అధికార యంత్రాంగం,పంజాబ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టారు. పలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. కాశీ కలన్, హవస్, సహిబానా, రజూల్ సహా లూథియానా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రతి గ్రామంలో పంట వ్యర్థాలను తగులబెట్టకుండా ఆ గ్రామ సర్పంచ్‌ బాధ్యత తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ అగర్వాల్ ఈ సందర్భంగా కోరారు.