
కరోనా వైరస్ ప్రపంచదేశాలను ఎలా అల్లకల్లోలం చేసిందో అందిరకీ తెలిసిందే. అయితే ఇప్పుడు కరోనా ముుప్పు తగ్గిపోవడంతో అందరూ తమ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. కరోనా లాగే ‘డిసీజ్ ఎక్స్ (Disease X)’ రూపంలో మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని గత కొన్ని రోజుల నుంచి జోరుగా ప్రచారాలు నడుస్తున్నాయి. దీంతో ప్రపంచదేశాల్లో మళ్లీ కలవరపడటం మొదలైంది. అంతేకాదు ఈ డిసీజ్ ఎక్స్ మహమ్మారి కరోనా కంటే అధిక ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని.. బ్రిటన్ శాస్త్రవేత్తలు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ భయాలను తాజాగా కొంతమంది అంటువ్యాధుల నిపుణులు కొట్టిపారేశారు. ప్రస్తుతానికి అటువంటి మహమ్మారి ఏదీ కూడా ప్రస్తుతం వ్యాప్తిలో లేదని, సమీప భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం లేదన్నారు. ఈ డిసీజ్ ఎక్స్ అనేది కేవలం ఊహాజనిత ముప్పు మాత్రమేనని పేర్కొన్నారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా కొత్త మహమ్మారి వచ్చినట్లైతే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని.. ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాబోయే మహమ్మారిని ‘డిసీజ్ ఎక్స్ (Disease X)’ అని తెలిపింది. అయితే.. దీనిపై ఇటీవల బ్రిటన్ మీడియాలో కొన్ని కథనాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కరోనా మహమ్మారి లాగే డిసీజ్ ఎక్స్ సైతం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపించనుందని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న డేమ్ కేట్ బింగ్‌హామ్ వివరించినట్లు వాటిల్లో పేర్కొన్నాయి. అలాగే కరోనా కంటే డిసీజ్ ఎక్స్ ప్రజలపై 7 రెట్లు ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని డేమ్ కేట్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీనివల్ల మరో మహమ్మారి ముంచుకొస్తోందని కొద్ది రోజులుగా నెట్టింట జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా.. దీనిపై తాజాగా పలువురు ఆరోగ్య రంగ నిపుణులు స్పందించారు. అదంతా ఒక ఊహాజనిత ముప్పుని తోసిపుచ్చారు. అయితే, భవిష్యత్తులో ఏవైనా మహమ్మారులు వస్తే వాటని ఎదుర్కొవడానికి ఈ సంసిద్ధత అనేది ఉపయోగపడుతుందని చెప్పారు. మీ ఇంట్లోకి దొంగలు రాకపోవచ్చు. కానీ.. వస్తారేమోనన్న భయంతో మీరు సీసీటీవీలు ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఇంటికి తాళం వేస్తారు. శునకాన్ని కొని.. అన్ని అయుధాలు సిద్ధంగా ఉంచుకుంటారని.. అలాగే డిసీజ్ ఎక్స్ (Disease X) కూడా.. ఇలా దొంగలొస్తారన్న ఊహ లాంటిదేనని నిపుణులు తేల్చి చెప్పారు. రాబోయే రోజుల్లో ఇలాంటి సవాళ్లను ఎదుర్కొవానికి ఇప్పటి నుంచే సన్నద్ధత అనేది చాలా అవసరమని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI) డాక్టర్ ఎన్‌కే అరోడా ఓ జాతీయ మీడియాతో అన్నారు. మరో ముప్పును ఊహించుకుంటూ దాన్ని ఎదుర్కొవడానకి ఇప్పటినుంచే శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..