
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ కౌంటర్ ఎటాక్ చేసింది. ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపుదాడులు చేసింది. పీవోకేలోని 9 ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు చేసింది. బహావల్‌పూర్, కోట్లీ, ముజఫరాబాద్‌పై క్షిపణి దాడులు చేసింది. బహావల్‌పూర్‌లో 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అర్ధరాత్రి ఒంటిగంటా 28 నిమిషాలకు దాడులు ప్రారంభించినట్టు ఆర్మీ ట్వీట్ చేసింది. భారతదేశం చేసిన ఈ దాడిలో హఫీజ్ సయీద్, మసూద్ అజార్ చనిపోయారా, లేదా తప్పించుకున్నారా? అనేది తేలాల్సి ఉంది.
బహవల్‌పూర్‌లోని మసూద్ అజార్ ప్రధాన కార్యాలయాన్ని భారతదేశం లక్ష్యంగా చేసుకుంది. వీరి ప్రధాన కార్యాలయం, మదర్సా ధ్వంసమయ్యాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా స్వయంగా ధృవీకరించింది. ఈ దాడిలో 50 మంది జైషే ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది.
ఇది కాకుండా, మురిడ్కేలోని లష్కరే రహస్య స్థావరాన్ని భారతదేశం ధ్వంసం చేసింది. ఈ దాడిలో లష్కరే, జైషే సంస్థలకు చెందిన చాలా మంది అగ్ర కమాండర్లు హతమయ్యారు. అయితే, ఈ దాడిలో మసూద్ అజార్, హఫీజ్ సయీద్ మరణించినట్లు ఎటువంటి సమాచారం రాలేదు.
భారత దాడి తర్వాత, పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ ప్రధాని ఈ దాడిని ధృవీకరించారు. భారతదేశం మనపై యుద్ధానికి కాలు దువ్విందని ఆయన అన్నారు. ప్రతీకారం తీర్చుకునే హక్కు మనకు ఉందంటూ, దీటుగా బదులిస్తామని ప్రకటించారు.
⚡️Bhawalpur missile strike visuals. People evacuated from the area by Pakistani authorities#OperationSindoor #PahalgamTerroristAttack #PakistanArmyBehindPahalgam pic.twitter.com/0gIKVtXLFp
— 🪷 Santanu Mallick 🇮🇳 (@Santanu_100) May 6, 2025
ముజఫరాబాద్‌లో 2 దాడులు చేసింది. బహవల్పూర్‌లో మూడవ దాడి చేసింది. కోట్లిలో 4వ దాడి, చక్ అమ్రులో 5వ దాడి, గుల్పూర్‌లో 6వ దాడి, భింబర్‌లో 7వ దాడి, మురిడ్కేలో 8వ దాడి, సియాల్‌కోట్‌లో 9వ దాడి చేసినట్లు భారత్ ప్రకటించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..