ధోనిపై ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన ట్వీట్‌

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగష్టు 15 సందర్భంగా తన రిటైర్మెంట్‌ని ప్రకటించారు ధోని

ధోనిపై ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన ట్వీట్‌

Edited By:

Updated on: Aug 16, 2020 | 12:05 PM

Subramanian Swamy on Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగష్టు 15 సందర్భంగా తన రిటైర్మెంట్‌ని ప్రకటించారు ధోని. దీంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ దేశం షాక్‌కు గురైంది. ఇదిలా ఉంటే ధోనిపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన ట్వీట్ చేశారు.

”ఎం.ఎస్. ధోని క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యారు. కానీ మిగిలిన వాటి నుంచి కాదు. కష్టాలను జయించగల సత్తా ఆయనకు ఉంది. క్రికెట్‌లో తన టీమ్‌కు ఆయన అందించిన లీడర్‌షిప్ ప్రజలకు కూడా అవసరం. 2024 ఎన్నికల్లో ధోని లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేయాలి” అని సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. అయితే ధోని రాజకీయాల్లోకి వస్తాడని ఎప్పటి నుంచో పుకార్లు వినిపిస్తుండగా.. తాజాగా స్వామి వేసిన ట్వీట్‌ వాటికి బలాన్ని చేకూరుస్తుంది. మరి రాజకీయాలపై ధోని అభిప్రాయమేంటో.. ఆయనే స్వయంగా వెల్లడించాలి.

Read More:

నీ వలనే కోలుకున్నా.. ప్లాస్మా డోనర్‌ కాళ్లు కడిగిన డిప్యూటీ స్పీకర్

కాఫీ పొడితో ‘గాంధీ బొమ్మ’.. వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన తమిళనాడు టీచర్‌