Viksit Bharat Buildathon 2025: వికసిత్ భారత్ బిల్డథాన్‌తో యువత ఐడియాలకు రెక్కలు.. 10 భాషల్లో మంత్రి సందేశం..

వికసిత్ భారత్ బిల్డథాన్ 2025లో పాల్గొనాలని విద్యార్థులకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు. ఇది యువత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన అతిపెద్ద స్కూల్ హాకథాన్. అక్టోబర్ 13న జరగనున్న ఈ లైవ్ సింక్రొనైజ్డ్ ఇన్నోవేషన్ ఈవెంట్ కోసం మంత్రి తన సందేశాన్ని తెలుగుతో సహా 10 భారతీయ భాషల్లో వీడియోల రూపంలో విడుదల చేశారు.

Viksit Bharat Buildathon 2025: వికసిత్ భారత్ బిల్డథాన్‌తో యువత ఐడియాలకు రెక్కలు.. 10 భాషల్లో మంత్రి సందేశం..
Viksit Bharat Buildathon 2025

Updated on: Oct 12, 2025 | 4:13 PM

దేశంలో ఆవిష్కరణలను బలోపేతం చేయడంతో పాటు యువతను వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడానికి కేంద్రం సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 లో ఉత్సాహంగా పాల్గొనాలని దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ మెగా ఇన్నోవేషన్ ఈవెంట్ అక్టోబర్ 13న ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు లైవ్ సింక్రొనైజ్డ్ ఇన్నోవేషన్ ఈవెంట్‌‌గా దేశవ్యాప్తంగా జరగనుంది. ఇది కేవలం పోటీ కాదు.. దేశం కోసం మీ ఇన్నోవేటివ్ ఐడియాలను ప్రపంచానికి చూపించే బిగ్గెస్ట్ ప్లాట్‌ఫామ్ అని చెప్పొచ్చు.

10 భాషల్లో సందేశం..

మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన సందేశాన్ని నేరుగా విద్యార్థులకు, ప్రాంతీయ భాషల్లో అందించడానికి AI టెక్నాలజీని ఉపయోగించారు. ఇంగ్లీష్‌తో పాటు, తెలుగు సహా మరో 10 భారతీయ భాషల్లో ఆయన వీడియో మెసేజ్‌లు విడుదల చేశారు. వీటిలో హిందీ, ఒడియా, గుజరాతీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలు ఉన్నాయి. ఏఐ తో ట్రాన్స్‌లేట్ చేయడం వల్ల భాషాపరమైన అడ్డంకులు ఉండవు. అంతేకాకుండా టెక్నాలజీని వాడి మన భారతీయ భాషలను పెంపొందించడం. దీనివల్ల కమ్యూనికేషన్ ఫాస్ట్గా, యూనివర్సల్గా మారుతుంది.

బిల్డథాన్ యొక్క లక్ష్యాలు

వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 అనేది స్కూల్ పిల్లల కోసం జరుగుతున్న అతిపెద్ద హాకథాన్ అని చెప్పొచ్చు. విద్యా మంత్రిత్వ శాఖలోని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం , అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇది దేశంలోని 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థుల్లోని సమస్యను పరిష్కరించే నైపుణ్యాన్ని బయటికి తీస్తుంది.

అక్టోబర్ 13 న ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు దేశవ్యాప్తంగా జరిగే లైవ్ సింక్రొనైజ్డ్ ఇన్నోవేషన్ ఈవెంట్‌లో మీరు మీ ఐడియాలను సమర్పించాలి. విద్యార్థుల ఐడియాలు ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్, సమృద్ధ్ భారత్ అనే అంశాలపై ఉండాలి. విన్నర్స్ కి బహుమతులే కాదు, వాళ్ళ ఐడియాలకు ప్రభుత్వం సపోర్ట్ చేసి, పెద్ద స్టార్టప్‌లుగా మారడానికి కూడా హెల్ప్ చేస్తుంది! సో, ఆలస్యం చేయకండి… మీ స్కూల్ టీమ్‌తో కలిసి ఈ నేషన్ బిల్డింగ్ మూవ్‌మెంట్‌లో భాగం అవ్వండి!

ముఖ్యమైన తేదీలు..

    • లైవ్ సింక్రొనైజ్డ్ ఇన్నోవేషన్ ఈవెంట్ – అక్టోబర్ 13
    • ప్రాజెక్ట్‌ల తుది సమర్పణ – అక్టోబర్ 13 – అక్టోబర్ 31
    • ప్రాజెక్ట్‌ల మూల్యాంకనం – నవంబర్ 1 – డిసెంబర్ 31
    • ఫలితాల ప్రకటన – జనవరి 2026

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..