AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీట్ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇకనైనా తప్పుడు ప్రచారం ఆపాలి: ధర్మేంద్ర ప్రధాన్

నీట్ అంశంపై కాంగ్రెస్, ఇండియా కూటమి అసత్యాలను ప్రచారం చేస్తూ.. విధ్యార్ధులను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఇప్పటికైనా తమ మోసపూరిత విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆపాలని మండిపడ్డారాయన. విద్యార్ధుల భవిష్యత్తుతో ఆడుకునేవారిని..

నీట్ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇకనైనా తప్పుడు ప్రచారం ఆపాలి: ధర్మేంద్ర ప్రధాన్
Education Minister Dharmendra Pradhan
Ravi Kiran
|

Updated on: Jul 03, 2024 | 6:49 PM

Share

నీట్ అంశంపై కాంగ్రెస్, ఇండియా కూటమి అసత్యాలను ప్రచారం చేస్తూ.. విధ్యార్ధులను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఇప్పటికైనా తమ మోసపూరిత విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆపాలని మండిపడ్డారాయన. విద్యార్ధుల భవిష్యత్తుతో ఆడుకునేవారిని తమ ప్రభుత్వం విడిచిపెట్టదంటూ ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో పేర్కొన్న నేపధ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. నీట్‌, నెట్‌ వంటి పోటీ పరీక్షల్లో పేపర్‌ లీకేజీతో సహా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. విపక్షాలు పార్లమెంట్‌లో ఈ అంశంపై చర్చకు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

‘నాడు, నేడు పలు అంశాల్లో దేశాన్ని మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది. నీట్‌ విషయంలోనూ వారి ఉద్దేశం బహిరంగంగానే బయటపడింది. సమస్యల నుంచి పక్కదోవ పట్టించి.. అస్థిరత సృష్టించాలన్నదే ఇండియా కూటమి ముఖ్య ఉద్దేశం. అసత్యాలు, పుకార్లు పుట్టించి.. తాము దేశ, విద్యార్ధి వ్యతిరేకమని మరోసారి చెబుతున్నాయి కాంగ్రెస్, ఇండియా కూటమి’ అని ధర్మేంద్ర ప్రధాన్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

యువశక్తి, వారి ఉజ్వల భవిష్యత్తు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత. ప్రతీ యువ విద్యార్ధి వెనుక ఈ ప్రభుత్వం ఉంటుంది. వారికి ఎలాంటి అన్యాయం జరిగినా సహించమని ప్రధాని మోదీ రాజ్యసభలో ప్రస్తావించారు. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వం కొత్తగా చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చి.. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. కాబట్టి కాంగ్రెస్, ఇండియా కూటమి విధ్యార్ధులను తప్పుదోవ పట్టించే అసత్యాలను ప్రచారం చేయడం ఇకనైనా ఆపాలని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. కాగా, నీట్, నెట్ పరీక్షల అవకతవకలపై ఇప్పటికే సీబీఐ విచారణ చేపడుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి