AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాట స్పీడ్ పెంచిన ధనుష్.. వరుస సమావేశాలతో పొలిటికల్ హీట్.. మహిళా ఫ్యాన్స్‌తో కీలక భేటీ..

ఢిల్లీలో సీక్రెట్ మంతనాలు.. చెన్నై వేదికగా వేలాది మంది మహిళా అభిమానులతో ముఖాముఖి భేటీ.. కోలీవుడ్ టు కోట.. స్టార్ హీరో ధనుష్ వేస్తున్న సరికొత్త పొలిటికల్ స్టెప్స్ వెనుక ఉన్న వ్యూహమేంటి? 2031 అసెంబ్లీ బరిలోకి ధనుష్ దిగడం ఖాయమేనా? మరోవైపు టీవీకే నుంచి దూసుకొచ్చిన సైతాన్ కామెంట్స్.. వీటన్నింటికీ ధనుష్ ఇచ్చే కౌంటర్ ఏంటి? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

తమిళనాట స్పీడ్ పెంచిన ధనుష్.. వరుస సమావేశాలతో పొలిటికల్ హీట్.. మహిళా ఫ్యాన్స్‌తో కీలక భేటీ..
Dhanush Political Moves
Ch Murali
| Edited By: |

Updated on: Oct 25, 2026 | 3:04 PM

Share

తమిళనాట మరో సినీ హీరో రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమవుతుందా? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ప్రముఖ నటుడు ధనుష్ రాజకీయ అడుగులు శరవేగంగా పడుతుండటంతో కోలీవుడ్ సహా తమిళ రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది. వారం రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో పలువురు కీలక వ్యక్తులతో మంతనాలు జరిపిన ధనుష్, తాజాగా చెన్నై వేదికగా చేపట్టిన కార్యక్రమం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. చెన్నై ఓఎంఆర్ రోడ్డు, చోళింగనల్లూరులోని జెప్పియార్ ఇంజినీరింగ్ కాలేజీలో ధనుష్ మహిళా అభిమాన సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ధనుష్ అభిమాన సంఘానికి సంబంధించి తమిళనాడులోని 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ భేటీకి తరలివచ్చారు.

సుమారు 2,500 మందికి పైగా ప్రతినిధులతో పాటు, మొత్తం 3,000 మందికి పైగా మహిళా అభిమానులతో ధనుష్ ముఖాముఖి భేటీ అయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అభిమానులతో ఫొటోలు, నేరుగా వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళా ఓటు బ్యాంకుతోనే ఏ రాజకీయ ప్రయాణమైనా బలపడుతుందనే ఉద్దేశంతోనే ధనుష్ తొలి ప్రాధాన్యతగా ఈ భేటీని ఏర్పాటు చేసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

2031 అసెంబ్లీ బరిలోకి రావాలని అభిమానుల ఆకాంక్ష

ధనుష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని, 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. ప్రస్తుత సమావేశంలోనూ అభిమానులు ఇదే నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఢిల్లీ పరిణామాల వెంటనే ఈ స్థాయిలో రాష్ట్రవ్యాప్త మహిళా అభిమానులతో సమావేశం కావడం ధనుష్ రాజకీయ ప్రవేశానికి స్పష్టమైన పునాదిగా కనిపిస్తోంది.

రాజకీయ దుమారం.. టీవీకే వర్సెస్ ధనుష్..

మరోవైపు ధనుష్ రాజకీయ కదలికలు ఇతర పక్షాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం నేత ఆదవ్ అర్జున ధనుష్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ‘‘డీఎంకే అనే సైతాన్ పోయింది.. ఇప్పుడు పిల్ల సైతాన్లు తమిళనాడులోకి రాబోతున్నాయి. ఢిల్లీలో కూర్చొని ఏ నటుడు డ్రామాలాడుతున్నాడో మాకు తెలియదా?’’ అంటూ ఆయన చేసిన విమర్శలు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ధనుష్ అడుగులు ఎటువైపు..? టీవీకేకు ఎటువంటి కౌంటర్ ఇస్తారన్ని ఆసక్తిగా మారింది.

Follow Us