Corona: కేసులు పెరుగుతున్నాయ్.. మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిందే.. డీజీసీఏ ఆర్డర్స్

|

Aug 18, 2022 | 6:34 AM

దేశంలో (India) కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వాతావరణం మార్పుతో చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు. కొందరు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో డీజీసీఏ (DGCA) (ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్...

Corona: కేసులు పెరుగుతున్నాయ్.. మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిందే.. డీజీసీఏ ఆర్డర్స్
Follow us on

దేశంలో (India) కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వాతావరణం మార్పుతో చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు. కొందరు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో డీజీసీఏ (DGCA) (ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కీలక ఆదేశాలు జారీ చేసింది. విమానయాన సంస్థలు కరోనా ప్రోటోకాల్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వెల్లడించింది. ఈ నిబంధనలో ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ఉందని స్పష్టం చేసింది. ప్రయాణికులు మాస్కులు పెట్టుకునేలా చూడాల్సిన బాధ్యత విమానయాన సంస్థలపై ఉందని వివరించింది. ప్రయాణించే సమయంలో, గేట్లలోకి ఎంట్రీ అయ్యే సమయంలో ప్రయాణికులకు శానిటైజేషన్‌ను అందివ్వాలని పేర్కొంది. ప్రయాణికులు కరోనా ప్రొటోకాల్ నిబంధనలను బేఖాతరు చేస్తే విమాన సంస్థలు కఠిన చర్యలు తీసుకోవచ్చని డీజీసీఏ తెలిపింది. కరోనా నిబంధనలను పాటిస్తున్నాయో లేదో తెలుసుకోవడం కోసం విమానాశ్రయాల్లో, విమానాల్లో తనిఖీలు చేపడతామని స్పష్టం చేసింది. మాస్కు లు పెట్టుకోని ప్రయాణికులకు జరిమానాలు విధించాలని స్థానిక పోలీసులను, సెక్యూరిటీ ఏజెన్సీలను కోరాలని విమానశ్రయ ఆపరేటర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా.. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. అయినప్పటికీ వైరస్ చికిత్స విధానాలు అదుపులోనే ఉన్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. మరోవైపు కరోనా బారిన పడిన వారు ఆస్పత్రుల్లో చేరుతున్న ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య నాలుగున్నర కోట్లకు చేరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం