రామజన్మ భూమిలో హారతి.. భక్తులకు అవకాశం..!

| Edited By:

Mar 15, 2020 | 9:19 AM

అయోధ్య రామజన్మ భూమిలో రాబోయే శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు ట్రస్టు సభ్యులు. ఈ సారి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే హారతి కార్యక్రమంలో ప్రత్యేకత చాటేందుకు రెడీ అయ్యింది ట్రస్ట్. ఈ సారి హారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులకు అవకాశం కలగబోతోంది. ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుంచి రామ్ లల్లా విగ్రహాలను సమీపంలోకి తరలించడం ద్వారా ఈ అవకాశం కలుగుతుంది. రామమందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. శ్రీ రామనవమి […]

రామజన్మ భూమిలో హారతి.. భక్తులకు అవకాశం..!
Follow us on

అయోధ్య రామజన్మ భూమిలో రాబోయే శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు ట్రస్టు సభ్యులు. ఈ సారి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే హారతి కార్యక్రమంలో ప్రత్యేకత చాటేందుకు రెడీ అయ్యింది ట్రస్ట్. ఈ సారి హారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులకు అవకాశం కలగబోతోంది. ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుంచి రామ్ లల్లా విగ్రహాలను సమీపంలోకి తరలించడం ద్వారా ఈ అవకాశం కలుగుతుంది. రామమందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. శ్రీ రామనవమి హారతి కార్యక్రమంలో హాజరయ్యేందుకు భక్తులందరినీ అనుమతించేందుకు ట్రస్టు సుముఖత చూపింది. దీంతో ఈ సారి పాల్గొనేందుకు భక్తులను అనుమతించాలని సంబంధిత ట్రస్టు నిర్ణయించింది.