AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్రమ శరణార్ధుల కోసం ఇదిగో డిటెన్షన్ సెంటర్ !

పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థిస్తూ ప్రధాని మోదీ.. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడినసందర్భంగా.. అసలు దేశంలో ఇలాంటి అక్రమ శరణార్ధుల కోసం డిటెన్షన్ సెంటర్లు ఎక్కడున్నాయో చూపాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అయితే ఆయా నగరాల్లో మెల్లగా ఈ విధమైన సెంటర్లు వెలుస్తున్నాయి. (అస్సాంలో అప్పుడే నిర్బంధ శిబిరాలు చాలా పని చేస్తున్నాయి). తాజాగా బెంగుళూరుకు సుమారు 30 […]

అక్రమ శరణార్ధుల కోసం ఇదిగో డిటెన్షన్ సెంటర్ !
Anil kumar poka
| Edited By: |

Updated on: Dec 23, 2019 | 12:42 PM

Share

పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థిస్తూ ప్రధాని మోదీ.. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడినసందర్భంగా.. అసలు దేశంలో ఇలాంటి అక్రమ శరణార్ధుల కోసం డిటెన్షన్ సెంటర్లు ఎక్కడున్నాయో చూపాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అయితే ఆయా నగరాల్లో మెల్లగా ఈ విధమైన సెంటర్లు వెలుస్తున్నాయి. (అస్సాంలో అప్పుడే నిర్బంధ శిబిరాలు చాలా పని చేస్తున్నాయి). తాజాగా బెంగుళూరుకు సుమారు 30 కి.మీ. దూరంలోని సొందేకొప్ప అనే గ్రామంలో ఓ నిర్బంధ శిబిర నిర్మాణం పూర్తవుతోంది. దీనికి ‘ ఫినిషింగ్ టచెస్ ‘ ఇస్తున్నారు. ఈ సెంటర్ కి రెండు వైపులా సెక్యూరిటీ టవర్లు కట్టేశారు. అలాగే ఎత్తయిన గోడలపై వైర్లతో ‘ కంచెల ‘ వంటివి బిగిస్తున్నారు. ఎల్.షేపులో గల బిల్డింగ్ లో ఏడు గదులు, కిచెన్, బాత్ రూములు ఉన్నాయి. ఒక్కో బిల్డింగ్ లో 15 బెడ్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. గేటు వద్ద ఓ పోలీసు గార్డుగా .. ‘ పహారా ‘ కాస్తుండగా.. కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖ పంపిన కొంతమంది భవన నిర్మాణ కార్మికులు లోపలికి వెళ్తున్నారు. కేంద్రం ఈ ఏడాది జనవరిలో పంపిన సర్క్యూలర్ల ఆధారంగా కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్బంధ శిబిరాన్ని సిద్ధం చేస్తోంది. జనవరి 1 న ఈ సెంటర్ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖ లోగడ ఇక్కడ హాస్టల్ ని నిర్వహించింది. దాన్ని నగర పోలీసులు స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతనెలలో ఆదేశించింది. దీన్నే ఇప్పుడు నిర్బంధ శిబిరంగా మార్చేస్తున్నారు. వచ్ఛే జనవరికల్లా ఈ కేంద్రాన్ని పూర్తిగా నిర్వహించేందుకు అనువుగా ప్రభుత్వం ఈ నెల 9 న ఆదేశాలు జారీ చేసింది. ఈ సెంటర్లో ఇంకా సీసీటీవీ కెమెరాలు అమర్చవలసి ఉందని, స్టాఫ్ క్వార్ట్రర్ల నిర్మాణాలు పూర్తి కావలసి ఉందని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు.

‘ మోదీజీ ! సింపుల్ గా గూగుల్ సెర్చ్ చాలదా ‘ ?

దేశంలో నిర్బంధ శిబిరాలు లేనేలేవన్న ప్రధాని మోదీవ్యాఖ్యలను సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ.. మీరు చెబుతున్నది నిజం కాదని, నిరూపించేందుకు సింపుల్ గా గూగుల్ లో సెర్చ్ చేస్తే చాలదా అని ప్రశ్నించింది. మీ అసత్యాల విషయంలో భారతీయులు తేలిగ్గా గూగుల్ లో వెదకలేరని అనుకుంటున్నారా అంటూ ట్వీట్ చేసింది. అస్సాంలోని డిటెన్షన్ సెంటర్లలో 28 మంది మరణించారని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ చేసిన వ్యాఖ్యల తాలూకు మూడు రిపోర్టులను ఈ పార్టీ పోస్ట్ చేసింది. అస్సాంలో ఇంకా కొత్త శిబిరాలు వెలుస్తున్నాయని పేర్కొంది. ఆ రాష్ట్రంలోని గోల్పారా జిల్లాలో మూడు వేలమంది శరణార్థులకు అనువుగా అతి పెద్ద నిర్బంధ శిబిరం నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే బెంగుళూరు రూరల్ డిస్ట్రిక్ట్ లోని నీలమంగళలోను, నవీ ముంబైలోను డిటెన్షన్ సెంటర్లు నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.