Derababa: 40 రోజుల పెరోల్‌పై డేరాబాబా విడుదల.. వివాదాస్పదంగా బీజేపీ నేతల ఎంట్రీ..

|

Oct 19, 2022 | 10:20 PM

అత్యాచార కేసులో జైలు శిక్ష డేరా బాబా పెరోల్‌పై విడుదలయ్యారు. హర్యానాలోని సనారియా జైలులో ఖైదీగా ఉన్న ఆయన..40రోజుల పెరోల్‌పై బయటికొచ్చారు. ఐతే ఆయన నిర్వహించిన ఆన్‌లైన్‌..

Derababa: 40 రోజుల పెరోల్‌పై డేరాబాబా విడుదల.. వివాదాస్పదంగా బీజేపీ నేతల ఎంట్రీ..
Dera Baba
Follow us on

అత్యాచార కేసులో జైలు శిక్ష డేరా బాబా పెరోల్‌పై విడుదలయ్యారు. హర్యానాలోని సనారియా జైలులో ఖైదీగా ఉన్న ఆయన..40రోజుల పెరోల్‌పై బయటికొచ్చారు. ఐతే ఆయన నిర్వహించిన ఆన్‌లైన్‌ సత్సంగ్‌కు పలువురు బీజేపీ నేతలు హాజరవడం వివాదాస్పదంగా మారింది. యూపీ బాగ్‌పత్‌ నుంచి డేరాబాబా నిర్వహించిన వర్చువల్‌ సత్సంగ్‌కు పలువురు బీజేపీ నేతలు హాజరవడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు హర్యానాలో వచ్చే నెలలో జరగనున్న ఎన్నికలను ప్రభావితం చేయడానికే డేరాబాబాకు పెరోల్‌ మంజూరు చేశారని ఆరోపిస్తున్నారు. ఐతే డేరాబాబా నిర్వహించిన సత్సంగ్‌కు బీజేపీతో సంబంధం లేదంటున్నారు కాషాయ పార్టీ నేతలు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ప్రజలే నిర్ణయిస్తారని..పెరోల్‌ కోరే హక్కు దోషులందరికీ ఉందన్నారు. ఆయన దీపావళి కోసం పెరోల్‌ తీసుకున్నారని..దాన్ని ఎన్నికలతో పోల్చకూడదంటున్నారు. ఇక హర్యానాలో నవంబర్‌ 3న అదంపూర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మరోవైపు రాష్ట్రంలోని 9 జిల్లాల్లో నవంబర్‌ 9,12 తేదీల్లో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. డేరా బాబా తన సిర్సా ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు ఆయనకు 2017, ఆగస్ట్‌లో 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఐతే ఈ ఏడాది డేరాబాబా ఇలా పెరోల్‌పై రిలీజ్‌ అవడం ఇది మూడోసారి. గత జూన్‌లో కూడా ఆయన పెరోల్‌పై విడుదలయ్యారు. తాజాగా మరోసారి అది కూడా..అదంపూర్ ఉప ఎన్నికకు ముందే ఆయనకు పెరోల్‌ లభించడం చర్చనీయాంశంగా మారింది.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..