PM Modi: భారత్‌పై సింగర్‌ మిక్‌ జాగర్‌ ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ..

| Edited By: Ram Naramaneni

Nov 18, 2023 | 3:09 PM

వివరాల్లోకి వెళితే.. ప్రముఖ ఇంగ్లిష్‌ గాయకుడు, లెజెండరీ రాక్‌స్టార్‌ మిక్‌ జాగర్‌ తాజాగా భారత్‌కు విచ్చేశారు. ఇందులో భాగంగానే ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ను వీక్షించిన జాగర్‌.. భారత దేశ పర్యటనపై సోషల్‌ మీడియా వేదికగా కొన్ని పోస్టులు చేశారు. దీపావళి పండుగను జరుపుకున్న ఆయన భారతీయులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే భారత్‌లో గడిపిన పలు మధుర జ్ఞాపకాలకు...

PM Modi: భారత్‌పై సింగర్‌ మిక్‌ జాగర్‌ ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ..
Pm Modi, Singer Mick Jagger
Follow us on

సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధానిగా ఎంతో బిజీ షెడ్యూల్‌లో ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం నిత్యం క్రీయాశీలంగా వ్యవహరిస్తుంటారు. సమాజంలో జరిగే ప్రతీ అంశంపై సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ లెజెండర్‌ రాక్‌స్టార్‌ మిక్‌ జాగర్‌ చేసిన ఓ ట్వీట్‌పై ప్రధాని ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

వివరాల్లోకి వెళితే.. ప్రముఖ ఇంగ్లిష్‌ గాయకుడు, లెజెండరీ రాక్‌స్టార్‌ మిక్‌ జాగర్‌ తాజాగా భారత్‌కు విచ్చేశారు. ఇందులో భాగంగానే ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ను వీక్షించిన జాగర్‌.. భారత దేశ పర్యటనపై సోషల్‌ మీడియా వేదికగా కొన్ని పోస్టులు చేశారు. దీపావళి పండుగను జరుపుకున్న ఆయన భారతీయులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే భారత్‌లో గడిపిన పలు మధుర జ్ఞాపకాలకు సంబంధించిన వీడియోలను పంచుకున్నారు.

సింగర్ జాగర్ ట్వీట్…

ఈ క్రమంలోనే భారత పర్యటనలో భాగంగా తన అనుభవాలను ఓ పాట రూపంలో పాడిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు మిక్‌ జాగర్‌. ఓ చెట్టు కింద పాట పాడుతున్న సమయంలో తీసిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ రాక్‌ సింగర్‌.. భారతదేశ ప్రజలకు ధన్యవాదాలు. రోజువారీ పనులకు దూరంగా, భారత్‌కు రావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ప్రేమతో’ అంటూ హిందీలో పోస్ట్ చేయడం విశేషం. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే మిక్‌ జాగర్ చేసిన ఈ ట్వీట్‌పై.. ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మిక్‌ చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన ప్రధాని. ఈ ట్వీట్‌లో ‘మీరు కోరుకున్న ప్రతిదీ పొందలేక పోవచ్చు.. కానీ భారతదేశం మాత్రం ఎంతో మంది అన్వేషకులతో నిండి ఉంటుంది. ఇక్కడ అందరికీ ఓదార్పు, సంతృప్తి లభిస్తుంది. మీరు ఇక్కడి ప్రజలు, సంస్కృతిలో ఆనందాన్ని పొందారని తెలుసుకోవడం ఆనందంగా ఉంది. భారత్‌కు ఇలాగే ఎప్పుడూ వస్తూ ఉండండి’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం మోదీ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

నరేంద్ర మోదీ ట్వీట్..

ఇక మిక్‌ జాగర్ విషయానికొస్తే.. రాక్‌ సంగీ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వారిలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. సుమారు 60 ఏళ్లుగా సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్నారు. 1943లో జన్మించిన మిక్‌ జాగర్‌ కేవలం గాయకుడిగానే కాకుండా సాంగ్ రైటర్‌, యాక్టర్‌, ఫిల్మ్‌ మేకర్‌, డ్యాన్సర్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..