Delhi Corona Cases: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు అక్కడ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ ఢిల్లీలో రద్దీ ఎక్కువగా ఉండే సాయంత్రపు మార్కెట్లు పంబాజీ బస్తీ, జనతా మార్కెట్‌లను మూసివేయాలంటూ జిల్లా ప్రకృతి విపత్తు నిర్వహణ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 30 వరకు వీటిని మూసివేసి ఉంచాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. (కరోనా అప్‌డేట్స్: తెలంగాణలో 602 కొత్త కేసులు.. ముగ్గరు మృతి.. కోలుకున్న 1,015 మంది)
అలాగే వ్యాపారులు మాస్క్‌ని ధరించి ఉండాలని, భౌతిక దూరాన్ని పాటించాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా ఢిల్లీలో ప్రస్తుతం మూడో వేవ్ కొనసాగుతుండగా.. మరణాల శాతం 1.58గా ఉంది. మరోవైపుకేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ( పెద్ద స్టార్‌తో క్రైమ్ డ్రామా.. ఈసారి మిమ్మల్ని నిరుత్సాహపరచనన్న తరుణ్ భాస్కర్)