Young Doctor Dies: దేశ రాజధాని ఢిల్లీలో విషాదం.. కూర్చున్నచోటే కుప్పకూలిన యువ డాక్టర్.. గంటల వ్యవధిలో గాలిలో కలిసిన ప్రాణాలు

|

May 10, 2021 | 11:56 AM

కరోనా మహమ్మారి ఎంతటి వారినైనా వదలడంలేదు. వయసుతో నిమిత్తం లేకుండా వైద్యులను సైతం హరిస్తోంది. తాజాగా ఢిల్లీలో విషాద ఘటన చోటుచేసుకుంది. క‌రోనా పాజిటివ్‌గా తేలిన కొన్ని గంట‌ల వ్యవ‌ధిలోనే ఓ యువ డాక్టర్ ప్రాణాలు కోల్పోయారు.

Young Doctor Dies: దేశ రాజధాని ఢిల్లీలో విషాదం.. కూర్చున్నచోటే కుప్పకూలిన యువ డాక్టర్.. గంటల వ్యవధిలో గాలిలో కలిసిన ప్రాణాలు
Delhi Young Doctor Dies Of Covid
Follow us on

Delhi Young Doctor Dies: కరోనా మహమ్మారి ఎంతటి వారినైనా వదలడంలేదు. వయసుతో నిమిత్తం లేకుండా వైద్యులను సైతం హరిస్తోంది. తాజాగా ఢిల్లీలో విషాద ఘటన చోటుచేసుకుంది. క‌రోనా పాజిటివ్‌గా తేలిన కొన్ని గంట‌ల వ్యవ‌ధిలోనే ఓ యువ డాక్టర్ ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోని గురుతేజ్ బ‌హ‌దూర్ (జీటీబీ) ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీలోని భ‌గీర‌థీ విహార్ ఏరియాకు చెందిన డాక్టర్ అనాస్ ముజాహిద్ (26) గ‌త జ‌న‌వ‌రిలో ఎంబీబీఎస్ ఇంట‌ర్న్‌షిప్ పూర్తిచేసి.. ఇటీవ‌లే గుర్తింపు పొందిన కోవిడ్‌-19 ఆసుపత్రిగా మారిన‌ జీటీబీ హాస్పిటల్స్‌లో విధుల్లో చేరారు.

శ‌నివారం సాయంత్రం వ‌ర‌కు హుషారుగా విధులు నిర్వహించాడు. ఆ త‌ర్వాత తన‌తోపాటే ప‌నిచేస్తున్న మ‌రో డాక్టర్ అమీర్ సోహైల్‌తో క‌లిసి అత‌ని ఇంట్లో ఇఫ్తార్ విందుకు వెళ్లాడు. ఆ తర్వాత ఆస్పత్రి యాజ‌మాన్యం త‌మ కోసం ఏర్పాటు చేసిన హోట‌ల్‌కు తిరిగి వ‌స్తుండ‌గా అనాస్ త‌న‌కు అస్వస్థగా ఉంద‌ని చెప్పాడు. దీంతో హోట‌ల్‌కు వెళ్లకుండా నేరుగా ఆస్పత్రికి వెళ్లి క‌రోనా టెస్ట్ చేయించుకోగా పాజ‌టివ్‌గా నిర్దారణ అయ్యింది.

విష‌యం తెలిసిన కాసేప‌టికే డాక్టర్ అనాస్ ముజాహిద్ కుర్చీలోంచి లేచి కుప్పకూలిపోయాడు. అత‌డిని వెంట‌నే ఐసీయూలో చేర్చి వైద్య ప‌రీక్షలు నిర్వహించ‌గా మెదడులో ర‌క్తం లీకైన‌ట్లు తేలింది. దీంతో అత‌డిని న్యూమరాల‌జీ వార్డుకు త‌ర‌లించి స‌ర్జరీకి ఏర్పాట్లు చేస్తుండ‌గానే ఆదివారం తెల్లవారుజామున 3 గంట‌ల స‌మ‌యంలో ప్రాణాలు కోల్పోయాడు. కళ్ల ముందు చలాకీగా తిరిగి తోటి వైద్యుడు ఆకాల మరణంతో ఆసుపత్రిలో విషాద చ్చాయలు అలుముకున్నాయి.

Read Also….  Medical Staff Recruitment: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఖాళీ పోస్టుల భర్తీ సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ బోర్డు నోటిఫికేషన్